Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు రాసిన అక్షరాలను ఆయధాలుగా మలిచిన స్థిరాస్తిని, స్వరాస్తి తన పాటతో అల్లుకున్న పిచ్చుకగూళ్ళు జీవితంలో తీయని జ్ఞాపకాలను మిగిల్చిన ఆయన పెదవి దాటి ఎదను మీటిన ఆ సాహిత్యం తెలంగాణ జీవితాన్ని ఆవహించుకున్న పాటలతోనే పరవళ్ళు తొక్కిచ్చి పౌరుషాన్ని నిలబెట్టిన డా.అశోక్ తేజ సాహిత్య స్వర బిందువు మమతల మంచుతో నిండిన సుగంధ సింధువుగా మారుతుంది. అందుకు అక్షర సాక్షిగా నిలిచిన కొమరం భీముడో పాటతో పెనవేసుకున్న ఈ కవి సహస్ర కళల విరి, సాహితీ మకరంధపు ఝరి.
పాటల సొగసు అర్థం చేసుకోవాలంటే పల్లవికి ప్రాణం ఉండే పదం, పదం, ప్రసవ వేదనం అన్న డా.అశోక్‌తేజ పాటల పారిజాతాలతో ఎన్నో అందాలు లాస్యం చేస్తాయి. అందులోని అక్షరం అందమైన నక్షత్రం.
కొమరం భీముడో, కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో
ఆ భావలహరిలో సూర్యభగవానుడు ఒకే విధంగా కాంతిని ప్రసరింపజేస్తున్నట్లుగా కనిపించే అగ్ని తత్త్వము మానవ శరీరంలోకి వస్తుందని తెలుగు పదం ఆయనకలంతో నాట్యం నేర్చుకుంది.
తెలంగాణ సాయుధ పోరాటంతో నిజాం నవాముల దుశ్చర్య దురాగతాలకు ఎదురొడ్డి పోరాడి వీర మరణం పొందిన ఎందరో మహానుభావులలో కొమరం భీముడిది ప్రత్యేకస్థానం. డా. అశోక్‌తేజ పాటలలో అచ్చమైన తెలంగాణ స్వరాలతో సుద్దాల ''పాళీ కొత్త ఓణి'' వేసింది.
''కాల్మొక్తా బాంచేనని ఒంగితోగాల
కొరడవీ తల్లీకి పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను ఒంచి తోగాల
తుముడు తల్లీ పేగున పెరగానట్టీరో''
బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా నీ గులాములం నీ మాటకు కాలం చెల్లి బర్మాష్ నీ జులుమేందిరా అంటూ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఉద్యమాల పురిటిగడ్డ మన తెలంగాణ. రాసే ప్రతి అక్షరం చెవులకు ఇంపుగా ఉంటుంది. మనసుకు హత్తుకుంటుంది. సినీ గీతాలు అభిషేకం చేసిన పద చిత్రకారుడు. ఆయన ఎవరో కాదు డా.సుద్దాల అశోక్‌తేజ. ఆ మదుర గాత్రం సంగీత శాస్త్రం.
''సెర్మ మొలిసే దెబ్బకు అబ్బంటోగాల
సిలికే రక్తము సూసిసెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వలికి తోగాల
భూతల్లీ సనుబాలు తాగానట్టేరో''
తమ బతుకులు మారాలంటే తమ ప్రాంతంలో పాలన తమదే అయి ఉండాలి. భీమ్ రగిల్చిన విప్లవ జ్యోతి ఇప్పటికి ప్రజల గుండెల్లో సజీవంగా మండుతూనే ఉంది. డా.అశోక్‌తేజ కవితల్లో మణులలాంటి కాంతి కిరణాలలో 'రక్తం' ప్రవహించదు. ఆయన 'అక్షరం' ప్రవహిస్తుంది.
''కొలువై పారే నీ గుండే నెత్తురూ నేలమా, నుదుట బొట్టవుతుంది సూడు. అమ్మా కాళ్ళపారాణైతుంది సూడు తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడు''
ఊహలకందని భావాల్ని పొదిగి ఆ పాటకు ప్రాణం పోసారు. ''కవిత్వం అనేది సత్యసనాతనం నిత్య నూతనం, కొత్తదైన సరికొత్తదైన కవిత్వం కవిత్వమే అన్నారు 'కరుణశ్రీ'. ఆయన పాటల ప్రస్థానంలో ప్రణయ గీతాలు రాసిన డా.అశోక్‌తేజ కలం హద్దుమీరలేదు. శృంగార భావాలు అంచులు దాటలేదు. ఇప్పటికీ ఈ పాటని ప్రతి తెలుగు చెవి వింటుంది. ఎప్పటికీ వింటూనే ఉంటంది.
''పుడమి తల్లీకి జనుమఅరణమిస్తవరో కొమరం భీముడో, కొమరం భీముడో''
బానిస సంకెళ్ళ విముక్తి కోసం నాడు చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించి చరిత్రలో నిలిచింది. స్వయంపాలన ఉద్యమాల వేగుచుక్క, పుడమి తల్లీ కోసం మరణాన్ని ఆహ్వానించిన కొమరం భీముడు పోరాట పంథానే చివరకు సరియైన మార్గమని తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదిమవాసి.
పదార్చన పోహళఙంపు వలన పాటకు 'తూగు' వస్తుంది. ఆ కంఠితమైన ఆత్మశుద్ధితో, పరశుద్ధితో, సందర్భశుద్ధితో రాయాలన్న 'ఆసక్తి' ఉంటే 'ఏ శక్తి' ఆపలేదు. మహర్షి వాల్మీకి రామాయణాన్ని ఇరువై నాలుగు వేల శ్లోకాలతో రాస్తే డా.అశోక్‌తేజ ఆత్మనేపథ్యం నుండి ఉబికి వచ్చిన తెలుగు నాట మోగిపోయిన నేలమ్మకు తిలకం దిద్దిన ఆవేదనాపూరితమైన వలయాలలో నుండి జాలువారిన పాటల తూటాలు అందించిన 'కళల కవాచి' ఈ రచయిత. ఆయన పేరు చెబితే పూలు పలకరిస్తాయి. తేనె చిలుకరిస్తుంది ఆ సాహితీ సౌందర్య పిపాసి.
- మమత కూరెళ్ళ, 9640500277