Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాం రచయితల వేదిక ఏడవ వార్షికోత్సవం ఈ నెల 29 ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజాం విద్యానికేతన్ పాఠశాలలో గార రంగనాథం అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ సభలో పిల్లా తిరుపతిరావు రచించిన 'ఆజిరి' సాహిత్య వ్యాస సంపుటిని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు పాకలపాటి రఘువర్మ ఆవిష్కరిస్తారు. విమర్శకుడు, కవి జి. లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ సలహాసభ్యుడు అట్టాడ అప్పలనాయుడు, కవి, కథా రచయిత గంటేడ గౌరునాయుడు, రచయిత వావిలపల్లి రాంబాబు ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారని వేదిక నిర్వాహకులు పేర్కొన్నారు.