Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో నిర్వహించబోయే తెలంగాణ లిటరరీ ఫెస్ట్ 2022లో జానపద వాగ్గేయకారుల సమ్మేళనం, సినీ గేయ సాహిత్యంపై పరిశోధకులతో సెమినార్ నిర్వహించనున్నారు. జానపద వాగ్గేయకారులు తాము రాసిన రెండు గీతాలను, వాటి నేపథ్యాన్ని, వారి పరిచయాన్ని రాసి ముందుగా పంపించాలి. పుస్తకంగా తీసుకురాబడుతుంది. సమ్మేళనంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాలి. సినీ గీతాలపై ఇప్పటికే నమోదు జరుగుతోంది. ఈ సాహిత్యోత్సవాలను జయప్రదం చేయాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి కోరారు. వివరాలకు మోహన్‌కృష్ణ - 8897765417, శరత్చంద్ర - 6309873682 లను సంప్రదించవచ్చు.