Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక ఉర్దూ నజ్మ్ కవితా శైలి వ్యవస్థాపకులలో ఒకడైన మీరాజీ పూర్తి పేరు ముహమ్మద్ సనాఉల్లాV్‌ా డార్. ఇతను 25 మే 1912లో జన్మించాడు. సాహిత్య పుస్తకాలన్న పాండిత్య పుస్తకాలన్న ఎంతగానో ఇష్టపడే మీరాజీకి అకాడమిక్ చదువులపైన ఆసక్తి ఉండేది కాదు. ఉద్యోగ రీత్యా ఇతను అదబీ దునియా, ఖయాల్ (సంపాదకుడిగా) మాసపత్రికలో పని చేసాడు. మీరాజీ స్వదేశీ కవులైన చండీదాస్, విద్యాపతి, మీరాబాయిల సాహిత్యాన్ని, పాశ్చాత్య కవులైన పుశ్కిన్ (రష్యా), హైనే (జర్మనీ) మొ. వారి సాహిత్యాన్ని అధ్యయనం చేసాడు. ఫలితంగా, మీరాజీ తనదైన కవిత్వ భాషను సష్టించుకోగలిగాడు.
మీరాజీ కవిత్వంలో ప్రగాఢ భారతీయత, ఉన్నతమైన కవిత్వాన్ని సష్టించగల సంభావ్యత మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటారు. 3 నవంబర్ 1949న తీవ్ర అనారోగ్యం వల్ల చిన్న వయసులోనే దేహం చాలించిన మీరాజీ, నిఘర్-ఖానా (గద్య అనువాదం), 223 నజ్మ్ కవితలు, 136 గీతాలు, 17 గజల్లు, 22 ఛందోబద్ధమైన అనువాదాలు, ఐదు పేరడీలతో తన సాహిత్య ఖజానాను నింపాడు.
మూలం:
చాంద్ సితారే ఖైద్ హై సారే వక్త్ కే బందీ-ఖానే మే
లేకిన్ మై ఆజాద్ హూ సాఖీ ఛోటే సే పైమానే మే
ఉమ్ర్ హై ఫానీ ఉమ్ర్ హై బాకీ ఇస్ కీ కుఛ్ పర్వా హీ నహీ
తూ యే కహ్ దే వక్త్ లగేగా కిత్నా ఆనే జానే మే
తుర్aసే దూరీ దూరీ కబ్ థీ పాస్ ఔర్ దూర్ తో ధోకా హై
ఫర్క్ నహీ అన్మోల్ రతన్ కో ఖో కర్ ఫిర్ సే పానే మే
పహ్లే తేరా దీవానా థా అబ్ హై అప్నా దీవానా
పాగల్-పన్ హై వైసా హీ కుఛ్ ఫర్క్ నహీ దీవానే మే
ఖుషియా ఆఈ అఛ్ఛా ఆఈ ముర్a కో క్యా ఎహ్సాస్ నహీ
సుధ్-బుధ్ సారీ భూల్గయా హూ దుఖ్కే గీత్ సునానేమే
అప్నీ బీతీ కైసే సునాఏ మద్-మస్తీ కీ బాతే హై
'మీరా-జీ' కా జీవన్ బీతా పాస్ కే ఇక్ మై-ఖానే మే
అనువాదం:
శశీసితారలు అన్నీ ఖైదీలయ్యెను కాలపు బంధీఖానాలో
మరి నేనేమో స్వతంత్రుడనైతిని ఓ చిన్న మందు గిలాసాలో
వయసేమో నశిస్తుంది, ఆయుష్షెంత మిగులుందనే ఆలోచనే లేదు
నువ్వైతే ఇది చెప్పు, సమయమెంత పడుతుందో రాకపోకల్లో
నీకూ నాకూ మధ్య దూరమెప్పుడుంది, దూరసమీపాలన్నవి రెండూ మోసాలే
తేడా ఏదీ లేదు వెలకట్టలేని రత్నాలను పోగొట్టుకుని తిరిగి పొందడంలో
ముందేమో నువ్వంటే ఉన్మాదం, ఇపుడేమో నేనంటే ఉన్మాదం
ఉన్మాదమంటేనే అటువంటిది, భేదమనేదే ఉండదు ఉన్మాదిలో
మంచి మంచి సంతోషాలెన్నోచ్చాయన్నది నాకు గుర్తులేదా ఏంటీ?
మంచి చెడ్డల అవగాహన మరిచానంతే, విషాదగీతం వినిపించుటలో
నా ఆత్మకథను వినిపించడమెలా, కైపు నిండిన కథలే అన్నీ
'మీరాజీ' జీవితమంతా గడిచిందే ఈ పక్కనే ఉన్న ఓ చావడిలో
మీరాజీ కవిత్వం చదివే ముందు తన జీవనశైలి గురించి తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. మీరాజీ బోహేమియన్ అంటే సంఘ విరుద్ధమైన (సంప్రదాయేతర) జీవితాన్ని గడిపాడు. తనలో చోటు చేసుకున్న నిరాశా నిస్పహల వల్ల చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అంతుపట్టని అవేదనలన్నీ మీరాజీలోని తాత్త్విక, అదిభౌతిక దక్పథాలను మేల్కొలిపాయి. సాధారణంగా మీరాజీ గజళ్ళలోని లయ గలగలా పారే గోదారిలా ఉంటుంది. ఈ ఎపిసోడ్లో కూడా చెవులకు ఇంపుగా ఉండే ఒక లయాత్మక గజల్ తీసుకోవడం జరిగింది. అందులో ఆలోచింపజేసే వర్ణనలెన్నో ఉన్నాయి. చంద్రుడు నక్షత్రాలు కాలపు బంధీఖానాలో బంధీలై ఉంటే, తానేమో ఒక చిన్న మందు గిలాసాలో స్వేచ్ఛను సాధించానని మొదటి షేర్లో కవి మురిసిపోతాడు. మూడవ షేర్లో దూరానికి దగ్గరకి తేడా ఏదీ లేదు. అవి రెండూ భ్రమలే అన్న నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తాడు. దానికి ఉదాహారణను రెండవ పాదంలో ఇచ్చాడు. ఈ శైలిలోనే ప్రేమలో పడితే ఏర్పడే ఉన్మాదం గురించి మూడవ షేర్లో స్పష్టం చేశాడు. దుఃఖ గీతాలను అంటే దుఃఖాన్ని వినిపించడంలో మంచి చెడ్డలు మరిచిపోయానని, అంతేకాని మంచి చెడ్డలు తనకు తెలియనివి కావని నాల్గవ షేర్లో స్పష్టం చేస్తాడు. చివరి షేర్లో, తన ఆత్మకథ వినిపిం చేదెలా? అసలు తన జీవితమంతా గడిచింది పక్కనే ఉన్న ఒక చావడిలో కదా అని చమత్కరిస్తూ గజల్ని ముగిస్తాడు.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి,
94410 02256