Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయస్థాయి వచన కవితల పోటీలకు ఆహ్వానం
గుంటూరుకు చెందిన ''బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్'' నిర్వహిస్తున్న 6వ జాతీయస్థాయి వచన కవితల పోటీకి కవితల్ని ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కవి రచయిత బండికల్లు జమదగ్ని, ప్రధాన కార్యదర్శి బండికల్లు శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు సామాజిక అంశాలను ప్రతిబింబించేలా 30 పంక్తులకు మించకుండా కవిత రాసి బండికల్లు జమదగ్ని, ప్లాట్ నెం. 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు-522 002 చిరునామాకు జులై 30లోగా పంపవచ్చు. ఒకరికి రెండు కవితలు రాసే అవకాశం ఉంది. ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులతో పాటు, నాలుగు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించనున్నారు. వివరాలకు బండికల్లు జమదగ్ని 98482 64742 నెంబరు నందు సంప్రదించవచ్చు.