Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవుడు మనల్ని కిందకు పంపేటప్పుడే మన తలరాతని రాస్తాడు కానీ కొంతమందికి మాత్రం స్పెషల్ పవర్స్ ఇస్తాడు. దేవుడు ఎంతో బిజీగా వుండి తన వాళ్ళకి (బిడ్డలకి) ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు తిరిగి ప్రాణం పోసే శక్తిని డాక్టర్స్ కి మాత్రమే ఇస్తాడు. అందుకే వైద్యుల్ని భగవంతుడుతో సమానంగా భావిస్తా ము. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మ నిస్తారు. ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతున్నారు. పీపీఈ కిట్లతో ఒళ్ళంతా ఉక్కి పోతున్నా, మాస్క్ తో ముఖం కమిలిపోతున్నా, శానిటై జర్ తో తమ చేతులు ఒరిసిపోతున్నా తమ వృత్తి పట్ల అంకిత భావంతో రోగులకు ఔషధంతోపాటు ప్రేమతో వ్యాధిని నయం చేసి స్వస్థత చేకూరుస్తున్నారు. ప్రతికూల పరిస్థితులలో కూడా దయార్థ హృదయంతో తోటివారికి సేవలందిస్తున్నారు నేటి వైద్యులు. 365 రోజులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్ యం కోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. స్వచ్చమైన తెల్లకోటు, మొక్కవోని నిబ్బరం తో అంకిత భావంతో అలుపెరుగని పోరాటం చేస్తూ రోగులకు అద్భుతమైన సేవలందిస్తూ వైద్య వృత్తికే వన్నె తెస్తున్నారు.