Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పులికొండ సుబ్బాచారి రచించిన నవల ''మాదిగ కొలుపు'' ఆవిష్కరణ ఈ నెల 21న సాయంత్రం 4.00 గం.లకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు లైఫ్ సైన్సెస్ ఆడిటోరియం (సౌత్కాంపస్)లో జరుగు తుంది. ఆచార్య వి.కృష్ణ అధ్యక్షతన తెలం గాణ సాహిత్య అకాడమీ, హైదరాబాదు విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యూమేని టీస్ సంయుక్తంగా నిర్వహించే ఈ ఆవిష్కర ణకు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య బి.జె.రావు గౌరవ అతిథిగా రానున్నారు. సాహితీ వేత్త, సినీనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ఆచార్య ఆర్.ఎస్. సర్రాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆచార్య ఘంటా చక్రపాణి, గోరటి వెంకన్న, ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు, జూపాక సుభద్ర, పూడూరి రాజిరెడ్డి ఆచార్య పిల్లలమర్రి రాములు పాల్గొననున్నారు.