Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా 'ఏమాయ చేశావే'. ఈ చిత్రంలో ఆమె అందం, అభి నయం, చక్కని నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇంకా చెప్పాలంటే అక్కినేని నాగ చైతన్య ఈ సినిమా తోనే సమంతతో లవ్‌లో పడి పోయారట. ఆ తర్వాత వీరిద్ద రికి వివాహం జర గడం, కొన్నాళ్లకు విడి పోవడం ఇవన్నీ తెలిసి నవే. కానీ ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైనట్టు ప్రకటించి నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో 'యశోద' సినిమాతో మళ్లీ తెరమీదకొచ్చింది సమంత. ఆమెకు సహజంగానే ఆమెకు క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీ. ఆమె అనారోగ్యంగా ఉందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడు తున్న తరుణంలో వాటికి సమాధానంగా ఈ నెల 11న 'యశోద' తో దూసుకొచ్చింది సమంత. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి పరిశీలిద్దాం.
ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సరోగసీ నేపథ్యంలో తీసిన సినిమా అని ఎవరికైనా అర్థమవుతుంది. బాహ్య ప్రపంచంలో చాలా చోట్ల కనిపించకుండా జరుగు తున్న ఈ విధానం ద్వారా చాలామంది అమాయకులు బలవుతున్నారు. డబ్బులకు ఆశపడి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారికి సరోగసీలోనే ఇంకొ ంత భయానకాన్ని పరిచయం చేసిన చిత్రమే 'యశోద'. బస్తీలో ఉండే ఒక పేద అమ్మాయి (సమంత) యశోద. ఆమెకు అనారోగ్యంతో ఉన్న చెల్లెలు. సరోగసీకి ఒప్పుకుంటే భారీగా డబ్బొస్తుందని, తన చెల్లెలి వైద్యానికి ఆ డబ్బు ఖర్చు చేయొచ్చనే కోణంలో నిర్ణయం తీసుకుంటుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్గేం టైపులో సరొగసీ గర్భిణులందరినీ ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతారు. ఆ చోటు చాలా సూపర్‌గా, అత్యాధునిక సౌకర్యాలతో కనిపిస్తుంది. అక్కడ బయట ఉన్న బర్డ్‌ను ముట్టుకోవాలనుకుని అది చేతికి తగలకపోవడంతో ఆశ్చర్యానికి లోనవుతుంది. ఆ సమయంలోనే ఒక పెద్ద ప్రమాదాన్ని పసిగడుతుంది యశోద. ప్యారలెల్గా ఒక మోడల్ కార్ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో చని పోవడం, ఆమె మర్డర్ ఇన్వెస్టిగేషన్‌పై కథ యాక్షన్ థ్రిల్లర్‌లా కొనసాగుతుంది. వాస్తవానికి చిత్రంలో సరోగసీ అనేది ఒక మాఫియా. ఇందులో కొంతమంది అమ్మాయిల పేదరికాన్ని ఆసరగా చేసుకుని వారికి డబ్బు ఆశ చూపించి లొంగదీసు కుంటారు. అయితే బిడ్డల్ని కనివ్వడం ఒక వంతైతే సరోగసీ ద్వారా పిండాలు కడుపులో ఉండగానే వారిని హత్య చేయడం విస్తుగొలిపే విషయం. ఎందుకు హత్య చేస్తున్నారో తెలుసుకోవడం కథలో ముఖ్యాంశం. శరీరంలో ముడతలు పోయేందుకు, వృద్ధాప్యం కనపడకుండా ఉండేందుకు సూర్య కిరణాలు పడని పిండాలను కడుపులోనే చంపి దాన్ని ట్రీట్మెంట్ ద్వారా ముఖానికి పెట్టుకోవడం వలన యవ్వనంగా కనిపిస్తారనేది ఇందులో తెలుసుకోవాల్సిన నిజం. ఈ మాఫియా ఆగడాలు అరికట్టేందుకు యశోద కష్టపడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. కథ పరంగా బాగానే ఉన్నా అనసరమైన కొన్ని సన్నివేశాలు ఉన్నాయనిపిస్తుంది. జోలాలి పాట ప్రేక్షకుల్ని కాస్తంతా గందరగోళం పెడుతుంది. కథనంలోని మూడ్‌కి కూడా అడ్డుపడే ఇలాంటి సన్నివేశాలు అక్కడక్కడ ఉన్నాయి. అయితే సెకాండఫ్‌లో మాత్రం కథ ముదిరి పాకాన పడుతుంది. అప్పటి నుంచి ప్రతి సీన్ ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. నిందితులను పట్టుకునేందుకు యశోద ఇన్వెస్టిగేషన్ ఈ కథకు ప్రధాన మూలమలుపు. ఎవరు హీరోనో, ఎవరు విలనో తెలియకుండా రకరకాల ట్విస్టులతో ఉత్కంఠగానే కథ సాగుతుంది. సాంకేతికంగా కూడా సినిమా చాలా సీన్లతో మెప్పిస్తుంది. నటీనటుల విషయానికొస్తే సమంత ఎప్పటిలాగే తన స్టయిల్లో బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా తానేంటో ప్రూ చేసుకుంది. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని కలగలిపి చూపించే పాత్ర గనుక అందులో ఇమిడిపోయింది సమంత. తన నటనకు వంద శాతం మార్కులు కొట్టేసింది. అయితే 'ఓ బేబీ', 'ఫ్యామిలీమ్యాన్', 'రంగస్థలం' సినిమాల్లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ అయితే కాదు. క్రైం యాంగిల్, సస్పెన్స్ జానర్ అడియాన్స్ మాత్రం చాలా ఎంజారు చేస్తారు. ఇక ఈ చిత్రంలో మనం చూడాల్సిన రెండోకోణం సరోగసీ. ఇటీవల ఇది దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండిస్టీని కూడా తాకింది.. నయనతార-విగేష్ దంపతులకు పుట్టిన కవలల విషయంలో ఈ వివాదం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే యశోద లాంటి సినిమాను తీయడం దర్శకుడు హరి-హరీశ్‌ను అభినందించాల్సిందే. సమాజంలో చాలా రకాల మోసాలు, అన్యాయాలు జరుగుతున్న ప్పటికీ ఇంకా చాలా మందిలో అవర్నెస్ రావడం లేదు. సరోగసీ ద్వారా బిడ్డల్ని కనివ్వడమంటే వారి రక్తాన్ని దారపోయడమే. ఎంతో కొంత డబ్బుకు ఆశపడితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలకు వారే కారణం. అయితే ఒకప్పుడు సెక్స్‌వర్కర్లను ఆస్యహించుకున్న వారే రేపు సరోగసీని కూడా ఛీకొట్టరని గ్యారంటీ లేదు కదా. అందుకే అడుగువేసే ముందే ఆలోచించాలి. అది మన బతుక్కు భరోసాగా ఉండాలి కానీ భారం కాకుడదని. యశోద మాత్రం ఇప్పుడున్న ట్రెండింగ్‌కు తగ్గ ఇంట్రెస్టింగ్ సినిమా అని చెప్పొచ్చు.
- ఎన్.అజయ్‌కుమార్