Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కతలూ, కైతలూ పత్రికా భాషలో వచ్చినంత ఇబ్బడిగా (అంతకంటే ఎక్కువగా) ఆయా తావుల మాండలికాల్లో రావాల్సి ఉండాది. దేనికంటే సంస్కతంతో ముడిపడిన పత్రికా భాషలో కంటే, బతుకుతో ముడిపడిన పలుకు భాషలోనే గుండె సొద నిండుగా బొమ్మ కడతాది. కానీ తెలుగు పలుకు మాండలిక కువ్వలన్నీ అచ్చుకు నోచుకోక ఆయా తావుల జనాల నాలికల మిందనే కాలాలు గడుపుకుంటుండాయి. తరానికి ఒకరో ఇద్దురో సాహసంతో మాండలికంలో రాయడం తెలుగు సాహిత్యం చేసుకున్న కొద్దిపాటి అదష్టం అనుకోవాలి. ఆ తీరున కె. వి. మేఘనాథ రెడ్డి మొరుసునాడు (చిత్తూరు) మాండలికంలో రాసిన ఈ 'కలుంకూరి గుట్ట కథలు' చదువర్లైన మీ గుండెల్ని అబ్బిళించుకుంటాయి. రాతరి (రచయిత) మంది ఇష్టాలకి, వాదాలకీ, మేధావితనానికీ పూచీ పడకుండా తను గడిచిన బతుక్కీ, నోటాడిన పలుకుకీ బాకీ పడినప్పుడే మాండలికానికి ఇట్టాటి న్యాయం దక్కతాది. ఈ రాతరికీ, కతలకీ పేరిమి నెనర్లు. కలుంకూరి గుట్టకి అరిమిలి దండాలు...
- సొలోమోన్ విజయ్ కుమార్