Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి :
పిల్లి : ఎలుకా క్షేమమా, కలుగులొ కుశలమా
ఎలుకా క్షేమమా, కలుగులొ కుశలమా
దొరకవా ... ఆ .. ఆ .. ఆ
ఎలుక : పిల్లీ వద్దమ్మా, విరసం ఆపుమా
చెలగాటమా... ఆ .. ఆ .. ఆ
చరణం :
పిల్లి : టామండ్ జెర్రిలా... కలిసే పోదమా
నువునా ప్రాణమా... స్నేహం కుదురునా
ఎలుక : ఎన్నో జన్మలా... వైరం మనదిలే
తరిమే కేతువా... చెలిమే చేదులే
ప్రళయమా... ఆ .. ఆ .. ఆ
పిల్లి : ఎలుకా క్షేమమా, కలుగులొ కుశలమా
ఎలుక : పిల్లీ వద్దమ్మా, విరసం ఆపుమా
చరణం :
ఎలుక : పోరా పోకిరీ... నీతో కిరికిరీ
యోచన తెలుసులే... పథకం పారదే
పిల్లి : వెతికా అంతటా... దొరకవు దొంగలా
ఎక్కడ నక్కినా... నువు నా కబళమే
వదలనే ... ఆ .. ఆ .. ఆ
ఎలుక : పిల్లీ దొరకనే, సరసం విరసమే
పిల్లి : ఎలుకా వదలనే, లంచుకు అంచుకే
తెలుసుకో ... ఆ .. ఆ .. ఆ
''రౌడీ అల్లుడు''(1991) చిత్రంలోని ''చిలుకా క్షేమమా'' పాటకు పేరడీ.
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి.