పోయెట్రీ
నన్ను చూసి
అందరూ అదోలా నవ్వుతరు
నేను నవ్వితే అదోలా చూస్తరు!
నవ్విన నాప చేను
ఎప్పటికైనా పండక పోదాని
నే నవ్వుతనే ఉంటా...
నవ్వు..
నవ్వు నాలుగు తీర్ల చేటైనా
నలభై తీర్ల మంచైనా
నువ్వు నవ్వకున్నా
నే
ప్రతి రోజూ పొద్దున్నే,
అతడు రెండు వేళ్ల మధ్యలో బ్రతుకును ఇరికించి నోట్లో పెట్టి
నిప్పంటించుకునేవాడు,
కాలిన బ్రతుకును కాలికిందేసి నలిపి కాలరెగరేసి
కదిలిపోతుండేవాడు...
గాల్లోకి ధూమాన్ని వత్తాకార వలయాలుగా ఊది,
చివర
పల్లె పచ్చగ వెల్లివిరిసి.. నవ్వుతుంటే చీకటెక్కడీ
బడుగు బ్రతుకుల.. ప్రగతి కోరే మనసు వుంటే చీకటెక్కడీ
చేతివత్తులు చేవ పుంజుకు.. ఆధునికతకు చేరువాయెను
పట్టుగొమ్మలు ఛాతి విరుస్తు..నడుస్తుంటే చీకటెక్కడీ
గడప గడపకు సరస్వతమ్
గౌరమ్మ... గౌరమ్మ ...నువ్వే మా బతుకమ్మ
మా తల్లి బతుకమ్మ మమ్మేలే బొడ్డమ్మ
చీరా సారేలు తెస్తాం చల్లంగా సూడమ్మా
మాయమ్మ మాయమ్మ కరుణించవే మాయమ్మ!
ఆడపిల్లల బ్రతులకు అడుగడుగునా గండాలయే
నడిరోడ్డు పైనే నల్లిలా నలిపేస్తున్నారే<
చిత్రహింసలు, మూగవేదన, మానవహక్కులను హరించిన
నిలువెత్తు కట్టడం సెల్యులార్ జైల్
చుట్టూ 1000 కిలోమీటర్ల భయంకరమైన సముద్రం,
నిత్యం యోధుల కనుల లోపల కానరాని
సునామీల సుడిగుండాలు,
కరుడు గట్టిన హృదయాలను సైతం కరిగించును
నడుస్తున్న చరిత్ర
ఏ సిరాతో రాయబడిందో!!...
ఎవరికీ అర్థంకాని
ఓ భయంకర కాలుష్యం
మనుషులను వెంబడించి
ఓ కాలసర్పమై
ఎందరెందరినో కాటేస్తుంది!!..
ఇది ఎవరికీ అర్థంకాని
ఓ అసమానతల చరిత్ర!!...
పరిఢవిల్లని మానవ ప
ఇది నా దేశం గాధ... నే యువతకు చేస్తున్న బోధ...
నా దేశ మనుష్యుల్ని వాళ్ళ తీరుతెన్నుల్ని చూస్తుంటే
ఎప్పుడో బాల్యంలో చూసిన 'జూ 'గుర్తుకొస్తుంది
రాజసం ఒలకబోసే మత్తగజాల్లా మంత్రివర్యులు
పెంచిన కుక్కల్లా పోలీసులు - తోడేళ్ళలా అధికారులు
గౌరమ్మ... గౌరమ్మ ... నువ్వే మా బతుకమ్మ
మా తల్లి బతుకమ్మ మమ్మేలే బొడ్డమ్మ
చీరా సారేలు తెస్తాం చల్లంగా సూడమ్మా
మాయమ్మ మాయమ్మ కరుణించవే మాయమ్మ!
ఆడపిల్లల బ్రతులకు అడుగడుగునా గండాలయే
నడిరోడ్డు పైనే నల్లిలా నలిపేస్తున్నారే
సృష్టిలోని పూరూపము
స్త్రీజాతికి నిజరూపము
తెలంగాణ బతుకమ్మ
ప్రకృతిమాత ప్రతిరూపము!
బతుకునిచ్చు బతుకమ్మ
నవరాత్రుల గౌరమ్మ
తీరు తీరు పువ్వుల్లో
నీకు సాటి లేరమ్మ!
పూలలోన చేరినావు
చైతన్యము నింపినావు
కాలం చాలా చిత్రమైనది
కాలం అందరికీ శిక్ష విధిస్తుంది
కాలంతో పాటు నడుస్తూ
నువ్వు నువ్వుగా మిగలలేదు
నేను నేనుగా మిగలలేదు
మనసు మాయలో పడిపోయాము
ఒకనాడు కలుసుకున్నాము
ఇంకెప్పటికి విడిపోమని భ్రమపడ్డాము
ఒకే దార
బిజీబిజీ వడివడి నడకలు
గజీబిజి తడబడు పరుగుల మధ్య
కావలసిన సూర్యుడి కోసం
తెలుసుకోవాల్సిన చందమామ కోసం
అవగతం చేసుకోవాల్సిన అంతరిక్ష విన్యాసం కోసం
తిరిగి వెళ్లాల్సిన పూర్వీకుల ప్రపంచం కోసం
పర్యటించాల్సిన మానవ పరిణామ ప్రస్థా
మలకుబోయిన మాయమ్మ
ఎండిన కట్టెల్ని ఇర్సుకొని
ఈతాకు మెలతో మోపుగట్టి
నడ్మ యాడ దించకుండగా తెచ్చిన
కట్టెలే మా పొయ్యిల
ఆకలికి కాలిపోతుంటాయి.
పురిటిపండగనాడే మాయమ్మ
గోసిబోసుకొని తెల్లజొన్నకంకులు కోయబోతే
సేను పె
ఏది భాష ఏది యాస
ఏది జాతి ఘోష
ఏది నేల శ్వాస
ఏది భావ ధ్యాస
అంబలి, దప్పడం, తొక్కు, సల్ల, ఉప్పిండి,
బుడ్డలు బుక్కిన తల్లి భాస
ఎక్క, చిమ్ని, కందీల ఎలుతురులెంట
కంచె తుడిపేసిన భాస
నరనారాయణుల నోట సరస్
మా వాడి నవ్వులను ఎవరు ఎత్తుకెళ్ల లేదు
మా వాళ్ళ మానాలను ఎవరూ చెరచలేదు
సారీ కంప్లైంట్ ఇవ్వలేను
మా బతుకు లెప్పుడూ అడవిలో అర్ధాంతరంగా
ఏ గొడ్డలి వేటుకో నేలకూలే చెట్ల మాదిరే
మీ చట్టాలెప్పుడూ
ద్రోహులను, దోపిడీదార
నా ఎడమ కంట్లోకి ఒక పక్షి
కుడి కంట్లోకి మరో పక్షి
నన్నడగకుండానే దూరి పోయాయి
అవి చెప్పే కథలు వినబోతున్నానని
ఆనందమేసింది
అవి స్పశించిన స్వేఛ్ఛా
తీరాల గూర్చి
కుటిలమెరుగని నదులు పాడే
లయల గురించి
పత్తికి మెత్తదనం మేమే
పంటకు పచ్చదనం మేమే
చెరుకుకి తీయ్యదనం మేమే
మల్లెకు తెల్లతనం మేమే
పసుపుకి పసిడితనం మేమే
ఆకులకి పసరుదనం మేమే
వేర్లకి గట్టిదనం మేమే
పట్టుకి పటుదనం మేమే
నిమ్మకు పులుపుదనం మేమ
కోడెలేగల చ
అంచనాలు తప్పి,
తలపులు తప్పులుగా నిరూపితమయ్యాయి,
ఓ అవాంఛనీయం బ్రతుకు మీద కాలేసి తొక్కిపట్టగానే
ఊహల ఊపిరాగిపోయింది....
తేరుకునేలోపే గుప్పిట్లో బంధించిన కాలం
వేళ్ళ మధ్యలోంచి నేర్పుగా తప్పించుకుంది.....
''తిరస్కారపు
ఇన్నేళ్ల స్వతంత్రంలో
మఱ్ఱి వృక్షం లాంటి నా దేశం
చిగురుటాకుల్లా వణుకుతు
చిన్ని కొవ్వొత్తి వెలుగులో
కోటి ఆశల్ని వెతుక్కుంటుంది!
తూటాలతో తూర్పు కెరటాల్ని
ఆపే రాజకీయ కను రెప్పల్లోని
కాలుష్యాన్ని కాగడతో
వెతకలేక మ
జీవితమంటే సగం వాక్యమే
రాలడానికే ఈ రాక
ఊహాజనిత భ్రమల్లో
బతుకును తీపిగా వాంఛిస్తున్నాం
మత్యునిదుర ముందు
మన చీమలబార్లు
ఉల్లాసంగా తిరుగుతుంటాయి
తను కళ్ళు తెరిస్తే
కుప్పిగంతులు దూళి రేణువుగా
చూస్తూ ఉండగానే
ఒక చిన్న గాలి విసురుకు
ఓ పండుటాకు నిశ్శబ్దంగా
నేల రాలింది!
రాలిన ఆకుకు లేదు
రాల్చుకున్న చెట్టుకే దుఃఖమూ లేదు
నన్నే ఆ దశ్యం వెంటాడే
విరిగిన పద్య పాదమైంది!
రామాయణమంతా తానై నడిపి
గర్భ పోరాటంలో విజేయుడైన
పసిబాలునికి ...
ఉగ్గు పాలను కాదు ...?
ఉద్యమ పాటలను ఊపిరిలుగా ఊదండి...!!
చందమామ కథలు కాదు...?
తెలంగాణ వెతలు,
దేశభక్తి కథలను కలిపి ముద్దగా పెట్టండి...!!
ఏడు చేపల కథలు కాదు
'ఆజాదీకా అమృతోత్సవ్' పేరిట
ఊరేగే భజనపరత్వంలో...
'గులామీ' కొనసాగింపుగా
అణచివేత సాగుతున్న
బూటక స్వాతంత్య్రంలో
సామాన్యుని జీవనాన్ని చూశారా?
చప్పట్లు తప్పెటల ఆర్భాటాలతో
మహమ్మారిని అంతం చేశామనే
అజ్ఞా
కాలం చరిస్తునే వుంటుంది
ఒక్కోసారి నత్తలా నడుస్తూ
మరోసారి
చిరుతలా దొర్లుతూ పరిగెడుతూ.
జీవితం తరిస్తుంటుంది
ఒక్కోసారి ఖేదంతో ఏడుస్తూ
మరోసారి మోదంగా నవ్వుతూ.
కాలం తుది తెలియని వాహిక
జీవితం ఎడతెగని
బాహ్య అంతర ప్రపంచంలో
భిన్న ధృవాల మధ్య నిరంతరం
అస్తిత్వ సంవేదనలతో కొట్టుకునే లోలకం స్త్రీ
విభిన్న బంధాలు ఆమె చుట్టూ పాదుకొని నిలబడతాయి
వివిధ పాత్రలతో అల్లుకొని
నియంత్రణ నీడలో మగ్గుతుంది
ఆమె స్థాన బలంలేని బలవంతురా
మోసెటోని మీదే మొద్దేసినట్టు
కూలవడ్డోని ముందు
అప్పుల కుప్ప పోసినట్టు
బతుకు భారమయిన కాలం
వాడేమో
ఇటుకమీద ఇటుక పేరుస్తూ
పునాదుల్లేని కలలమేడ అవుతాడు
ఆమె పని ఉన్ననాడు మెతుకు భోంచేసి
దొరకన్నాడు ఉపవాసం
జీవితాన్ని అనుభూతుల పూలతోట చేసినావు
కణకణమున చెలిమిపూల పుప్పొడినే నింపినావు
కులమన్నది మతమన్నది బంధాలకు సంకెలనే
అడ్డుగోడ కూలదోసి స్నేహగీతి పాడినావు
చెలిమెల్లో నీళ్ళుదాగి చెట్టక్కిన చిలిపిచేష్ట
చెదిరిపోని జ్ఞాపకాల
నేస్తమా.....
నా ఆధరాలపై ఒలికిన చిరునవ్వు
కావ్యమై నిన్ను తలపిస్తున్నది ...
హృదయమంతా పరుచుకున్న నీ ఆరాధన
ధన్యమై నన్ను ఆలరిస్తున్నది..
మనోహరం మది నిండుతుంటే
ఇంతకన్నా కావాల్సింది ఏముంది?
నా మనసు నిండిన ఓ మధుబాల
ఎంత
నేత పాట అల్లుతున్నా
కల ఊరుతూనే ఉంది
పాట ఆగక ముందే
కల తీరే వీలున్నదా?
ఈ చేతి కష్టం
ఈ చేతి సొమ్ముకు
ఎప్పుడూ సరితూగదు
మెట్టు దిగడమే గానీ
ఎక్కింది లేదు.....
పడడమే గానీ
ప
స్పందనారాహిత్య ఎడారి జీవితాన
నాకు హృదయ స్పందనగా మారతావు
కష్టాల మేఘాలన్నో కమ్ముకొని
వెచ్చని కన్నీరు ఉబికి వస్తుంటే
నులి వెచ్చని ఊపిరివై
ప్రాణాన్ని నిలబెడతావు
నా గొంతువింటే చాలు
నా బాధను గుర్తుపట్టే
మనో
వాడు బరిలో లేడు
అయినా...
వాడితోనే ఆట మొదలైంది
ఎవడు కూత పెడుతున్నాడో
ఎవడు పట్టు బడుతున్నాడో
అంతా గందరగోళమే
పొంచి పొంచి
పంజా విసురుతూ
పరుగుకాళ్ళకు సంకెళ్ళేస్తూ...
గీత కివతలి వైపే మూసేస్తున్నారు
కూత క
చెట్టంత బిడ్డ
చేదురు బావిల పడ్డట్టు
పంటలన్నీ నీళ్లపాలు
గ్రేహెండ్స్ దాడిలా
వాన తుపాకీ గుండ్లు
కాల్జేతులు కట్టేసి
గొంతుమీద కత్తిలా
ఒరుపులేనివాన
తేరుకోనియ్యని ముసురు
వానంటే
అమ్మ తలంటినట
నిన్నటి వార్తలన్నీ వెతికితే
నిజం కానరాలేదని
నిప్పు భగ భగ మండుతున్నది.
ఎండుకొమ్మ మీద వాలిన
పక్షులన్ని చిగురు కోసం
ఎదురుచూస్తుంటే ఆకాశంలో
మేఘము నవ్వుతున్నది.
గాయాలను దాచిన మాటలన్ని
గేయాలుగా కదల
నది ఉప్పొంగి ఎగిసివచ్చి
ఆత్మతో ఆప్యాయంగా
నా పాదాల్ని ముంచెత్తిన రోజున
నన్ను నేను తెల్సుకున్నాను
అద్దం అబద్దం చెప్పదు
నీళ్ళు నిలకడగా వుండవు
నా నీలం రంగు కళ్ళు
పచ్చదనాన్ని కలగంటున్నాయి
చెవులేమో నీటి అలల<
వూరూరికి నదీనదాల పాదాలు పారకున్నా....
పల్లె అయినా, పట్నమైనా సేదదీరేది
మా సెరువులతోనే...
మట్టితోని మరులుగొన్న నీటి వూటల్ని, మేటల్ని
తోలుకొచ్చే తొవ్వలము
నేలమ్మ నెలువులకు దిగొచ్చిన నెలవంకలము
మబ్బమ్మ పారేసుకున్న అద్దాలరైక
ఆకాశ మైదానమంతా చంద్రుడొక్కడే
ఆడుకొంటున్నడు
ఏవో ఏవో బాణాలు విడుస్తూ
ఎవరి కెవరికో గాయాలు మండిస్తూ
ఊష్ణ గోళాలని రగిలిస్తూ
ఒక్కోసారి-
శీతల మండలాలని విసిరేస్తూ
మరొకసారి-
విచిత్రంగా...
వినూత్నంగా...
విచ్
ఉదయం పూచే
తొలికిరణాలు అక్షర
పుష్పాలై కవుల కలాల..
ఆనంద డోలికలో తేలియాడుతూ..
కవన అరుణోదయానికి
బాటలు పరుస్తాయి
ప్రకతి పంచిన సౌందర్య గుబాళింపులతో
పచ్చని మొలకల సామ్రాజ్యపు
ఫలాలు వటవక్షల్లా కావ్య
వాడు
రంగుల కట్టలతో
రావిచెట్టు కట్టకాడ
రామసిలుకల రెక్కల
సప్పుల్లను వెదజల్లుతాడు..!!
వాడు
తిర్నాలలో రంగుల రాట్నమై
అరచేతిలో అంజనం వేసి
అద్భుత ప్రపంచాన్ని చూపిస్తాడు..!!
వాడు
సరస్సులోని శాపలకు
లే
ఇక ఇప్పటికి
నాకు నగరమంతా తెలిసిపోయింది అనుకుంటాను!
దశాబ్దాల కాలంగా ఇక్కడే సంచరిస్తున్నాను కదా
ప్రతి రోజూ కళ్ళతో పలకరిస్తూ
చేతులతో స్పర్శిస్తూ
నగరం అణువణువునూ ఆసాంతం
అవిశ్రాంతంగా ఆస్వాదిస్తూ ఉన్నాను కదా
నేను మీ రక్షకుడ్నని
మాటల మాయతో నమ్మగొల్పుతావ్
మమ్మల్ని ఒంటరిని చేసి
నీ వాట్సాప్ యూనివర్సిటీని ఉసిగొల్పుతావు
ఒళ్ళంతా విషాన్ని నింపుకొని
పైకి దేశానికి గొప్ప నటుడ్ని చూపిస్తావ్
నువ్వు దేశ
వేయి ఓటములు నాకివ్వు
అజేయమైన విజయమాల నీకందిస్తాను
కొన్ని శిశిరాలు నాకివ్వు
కోటి వసంతాలు నీ ముంగిట కుమ్మరిస్తాను !
ఈ వాన వెలిసిపోయేదాకా ఓపికపట్టు
ఏడురంగుల ఉయ్యాలలో నిన్నూపుతాను
ఈ రేయి చీకటినదిని యీదుకురా
రేప
వినరా వినరా మానవుడా..
తెలుసుకోరా నరుడా
పచ్చని ప్రకృతిని నేనే రా
ప్రాణ వాయువు నేనే రా
నీలోని విష వికృతికి
నేను వేదన భరించలేక
ప్రళయ తాండవం చేస్తున్నా
ఉప్పొంగి పరుగులు తీస్తున్నా
నన్నెందుకు కత్తులతో
నా పేరు హైదరాబాద్
శతాబ్దాల ఘనచరిత నాది...
విశ్వనగర స్థాయి నాది....
ఎందరో నిరుపేదలకు
వలసపక్షులకు ఆశ్రయమిచ్చిన
కల్పవృక్షాన్ని.
నా మొర ఆలకించకుండా
చెరువులు, కుంటలు ఆక్రమించి
ఆకాశహర్మ్యాలు నిర్మించేశ
చెట్ల కొమ్మలకు పండైనా
పండుటా కైనా రాలిపోయే వరకు
అంటుకునే ఉంటుంది
మోయలేని బరువని
కొమ్మలు వదిలించుకుంటాయా !
పిల్లలు వద్ధాశ్రమంలో
తల్లిదండ్రులను వేసి
చేతులు దులుపుకుంటున్న
చందముగా ఉంటాయా !
మల్లె తీగలకు
గడపలు పట్టనంత స్వార్ధంతో
గుమ్మాలు బావురుమంటున్నాయి.
హృదయాల వైశాల్యం తోరణాలకు కట్టబడిఉంటుంది.
కొనితెచ్చుకున్న మనోవైకల్యం
పరిసరాలను చుట్టిముట్టి
మమతలని మాలిన్యాల రజనులో అద్ది
దగ్గరలో దూరాలను పొదరింట్లో పాతుతుంద
యుద్ధం మొదలైంది
శత్రువు ఎదుట కానరాడు
కనబడని ఆయుధాలు
గాయపరుస్తూనే వుంటాయి..
యుద్ధం మొదలైంది-
పాలకులను గెలిపించి
ప్రజలు ఓడిపోతూ వుంటారు
శత్రువు కానరాడు, ఆయుధాలు కానరావు
కానీ, అన్నీ ధ్వంసమై పోతుంటాయి,
బీడు పారిన భూమ్మీద
ఎదురుచూసే మూగ జీవాల గోస చూడక
ఆకాశం ద్రవిస్తున్న హృదయ ఘోష
ఎడతెగక కురుస్తున్న కన్నీరే
దు:ఖ వర్షమై ఆయువు పోస్తున్న అపర బ్రహ్మ
ఏ జీవి భూమ్మీద అంతరించదనీ
చిల్లులు పడ్డ గగనం
నిండే జలాశయమై
ఇటుకలపై ఇటుకలు తయారు
సేత్తిమి...
మాపై ఇసుమంత ఇట్టం
లేకపోయె !
ఆకాసమెత్తు సౌదాలపై సౌధాలు
కడితిమి ...
మాకు కూసంత సోటు
ఇయ్యకపోతిరి !
రాదార్లపై రాదార్లు ఏత్తిమి ...
మాపై రవ్వంత పేమ
సూపకపోతిర
బాహ్య అంతర ప్రపంచంలో
భిన్న ధృవాల మధ్య నిరంతరం
అస్తిత్వ సంవేదనలతో కొట్టుకునే లోలకం స్త్రీ
విభిన్న బంధాలు ఆమె చుట్టూ పాదుకొని నిలబడతాయి
వివిధ పాత్రలతో అల్లుకొని
నియంత్రణ నీడలో మగ్గుతుంది
ఆమె స్థాన బలంలేని బలవంతురా
ఎండల
చెట్టునీడన
నాలుగు మధ్యం సీసాలు
విందుకు పోగైనై
జంబో గ్లాసుల్లో
ఆనందాన్ని ఒంపుకొని
చీర్సు కొట్టినై
ముక్కను కొరికి
మెత్తగ నమిలి
బొక్కను గిరాటేసినై
మత్తెక్కువైన బాటిళ్లు
గళ్
నింగిని చీల్చుకుంటూ వచ్చి
భూమిని తాకే మేఘపు పులకరింత !
భగ భగ వేసవికి సెలవిచ్చి
శీతలశీకర పలకరింత!
నింగికి నేలకు మధ్య
ప్రేమ ప్రసార భాషణంపు ముద్దుల వర్షంలో!
లేగదూడను ఆవు నాకే
వాత్సల్య దశ్యావిష్కరణ!
<