పోయెట్రీ
ఎండిన చెట్టుకు ఒక్క ఆకుపచ్చ ఆకైనా లేకుంటేనేం
అన్ని రంగుల పార్టీ జెండాలతో
అగ్ర తాంబూలంగా రాజకీయాలకు వేదికైంది
జెండాల అంగడి ఎండిన చెట్టు !
పక్షి గూళ్లకు జాగే లేదు !
ఎండిపోయిన చెట్టు ఒకటే !
వందల జెండాలకు ప్రకాండం
నువ్వు చేరక మునుపే
శూన్య గదిలో విస్తరించిన
గాలివాటంలా
నీ సంగతులన్నీ
చెవులు కొరుక్కుంటూ
అల్ప పీడన మబ్బులైపోతారు..!
నిజా నిజాల్ని తేల్చుకోవటానికి
అసహజ నవ్వుల్ని పూయిస్తూ
ముతక వాసన వేస్తున్న చూపులతో
నిన్నటివరకూ.. యీ అడవి
పురివిప్పిన నెమలిపిట్టలా ఎంత బావుండేదో ..!
పచ్చనికెరటాలమీద ఎగిరే పక్షులూ ..
తూరుపు తురాయికొమ్మకు వేలాడే సూరీడూ ..
చీకటికోనేటిలో సేదదీరుతున్న
అడవిఏనుగుల గుంపులాంటి నల్లని కొండలూ ..
నల్లని
బీర్లో ముంచి బిర్యానీలో కుక్కి
ఓట్లు దండు కొన్నాము
ఓట్లుకాదనీ సీట్లూ కొన్నాము
గద్దె నెక్కిన పాలన మాది
సర్వం మాదైనప్పుడు మురువొద్దు మరీ
పోలీసోళ్ళు మా వోళ్ళు
చట్టం రూపొందించేది
అమలు పరిచేదీ అంతా మేమే
ఒక మౌనం నుంచీ
మరొక గేయం చిగురిస్తోంది
ఒక ఉత్కంఠ నుంచీ
కొత్త ఉషోదయం ఊవిళ్లూరుతోంది
ఒక్క చినుకు
వేల ఉషస్సులై
కలల దారులెంట నడిపిస్తోంది
ఆశలు అలలై లేస్తూ
కళ్ళు పంటల ప్రమిదలౌతున్నారు
దుక్కితో నవ
ఆకలి కడ్పులతో అల్లాడుతున్న
ఊరి నడిబొడ్డునా
ఎండిన పేగుల మీద
వెచ్చని కవిత్వాన్ని రాస్తున్న..
కన్నీళ్ళకు బదులు
రగులుతున్న చైతన్యాన్ని
జారవిడుస్తున్న
ఇక్కడ నిత్యం
బతుకొక యుద్ధం
పానమొక సమిధ
జానెడు చొక్కా, లొడాసు లాగేసుకుని,
చేసిన బాల్యపు అల్లరిని తల్లిలా సహిస్తూ,
కంటికి రెప్పలా సాకిందా బడి,
నూనూగు మీసాల,
కౌమార చేష్టలను తండ్రిలా భరిస్తూ,
సున్నితంగా దండించిందా బడి,
ఆ బడి ప్రాంగణపు వేపచెట్లు చ
మనం సంతోషంగా ఉన్నాము..!
ఎందుకంటే
అగ్ని కీలలు మనవైపు లేవు
అవి వారి వైపే ఎగిసిపడుతున్నాయి..!!
వారి ఇల్లు కాలిపోతోంది
దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదం వినిపిస్తోంది
అయినా చలనంలేక
కొంత మంది మొహం చాటేస్తోంటే
పోగొట్టుకోడానికి
ఏం మిగిలిందని
కదిలే జీవంలేని కట్టెతప్ప
కాళ్ళకింద
పిడికెడుమట్టైనా
మిగలనివాళ్ళు
తేనెతుట్టెనులేపి
బతుకుల్ని బజారు పాలుచేసినట్టు
ఎంతకని వెంటాడి
వేటాడి మంటల్లో బొర్లిస్తరు
ఆ పసివేళ్ళు యంత్రం కన్నా వేగంగా
అంట్ల గిన్నెలను తోమి శుభ్రం చేస్తున్నాయి
ఆ వేళ్ళు పట్టుకోవాల్సింది పుస్తకం కలమని
అక్కడ చెప్పేవారు ఎవరు లేరు..
అమ్మ గారికి నీళ్ళు తెచ్చి ఇవ్వు
అయ్యగారికి కాఫీ పెట్టి తీసుకురా
రోబోట
నిప్పులు వోసి
నీళ్ళ కోసం వెదకినట్లు
ఉన్నదంత తగులవెట్టి
వాగ్దాన ఝల్లులు కురిపించడం !
పండు ముదిరి
పాకానవడి కిందవడే మోపున
ప్రకటనలు సురువు చేయడం !
సబ్ కో కిస్మత్ కా బాత్ !!
నియమాల్ల
ఎందుకో ఈ కవిత్వం
శాలువాలకు బిరుదులకు
సన్మానాలకు చిక్కనంటది
గూడాలు తండాలు
పల్లెలు అడవులు
కాలికి కలం కట్టుకొని
తిరిగొస్తానంటది
పక్షులని పచ్చనీ చెట్లని
చెరువులు నదులు
సముద్రాలు నక్షత్రాలను
వేదికేదైనా..!
కాలానికి ఊపిరిపోసే పాటొకటి
పాడమంటారు
ఏ చోటకెళ్లినా
చెలిమిగొంతులు
బతుకుపాట పాడమంటారు
ప్రేమపాటకు చప్పట్లతాళమవుతూ
యుగళ గీతానికి జోడీలు కడుతూ
విరహమో విషాదమో పల్లవి కాగానే
కళ్లను తడ
కదులుతున్న సైకిల్ చక్రంలా
గిరగిరా గిరగిరా తిరుగుతోంది
వాళ్ళ జీవన చక్రం
ఆకలి పోటుతో, ఆహారపు వేటలో...
రేపటి పౌరులువ్వాల్సిన బాలలు
డొక్క చేస్తున్న చప్పుడుకు తట్టుకోలేక
కొట్టుమిట్టాడుతూ కొట్టుమిట్టాడుతూ
అ
ఏ ఊహలు మోసిందో మయూరమై నా హదయం!!
సిరివెన్నెల కాసిందే అమాసలో నా నయనం!!
లేఖలెన్ని రాసిందో నీ మనసును దోచేందుకు
వలపు దీక్ష పూనిందే వయారమై నా పరువం!!
స్వరములెన్ని దాచిందో అనురాగం పాడేందుకు
వేణువెంత వగచిందో పలకలేక నా
పొద్దున్నే నా నిదురమోము
మా పెరట్లోని
స్పైడర్ గూట్లో చిక్కుకుంది
ఈ అనూహ్య అసహన
స్పర్షానుభూతికి
అసంకల్పిత ప్రతీకార చర్య
గూడు చెదిరిపోవడం నా వల్లే..!!
అహోరాత్రులూ అల్లుకున్న
వన్నె చిన్నెల
వెచ్చని పచ్చనిచీర కట్టుకొని
కన్నుల్లో కైపుల్ని నింపుకొని
కవ్విస్తూ వుంటాయి
అటేపు కొండలు
ఎంత ముద్దుగా బొద్దుగా వుంటాయో
పొద్దు పొద్దున్నే సూత్తూనే వుంటానా
ఇంతలోనే పొద్దువాలిపోద్ది
మురిసి మైమరుస్తూ బ్రతుకంతా
ఎద
మట్టిని కప్పుకునే దేహానికి
వెచ్చని దుప్పట్లెన్ని కప్పుతావు,
చీమలు పీక్కుతినే చర్మానికి
రంగులెన్ని పులుముతావు,
కట్టెలో కాలే సౌందర్యానికి
సొగసులెన్ని అద్దుతావు,
కపాలం భళ్ళున పగిలేదానికి
కిరీటాలెన్
కాలేజీ మొదటి రోజు ఏదో
లక్ష్మణరేఖ దాటినట్టు భయంగా
గేటులోపలికి అడుగేసాను
కాస్రూంకి వెళ్తూ తప్పిపోయిన
పసిబిడ్డోలె తెలిసిన మొఖాలు
కనిపిస్తవేమోనని వెతకడం మొదలెట్టాను
అప్పుడే రెక్కలిప్పుకున్న
సీతాకోకచిలుక
జీతమింత పెరగక అప్పు తీరదు
పొదుపు చేసి బతికినా అప్పు తప్పదు ||జీత మింత||
ప్రైవేటు జాబుకైనా చేబదులే తప్పనిదై
వడ్డి విరగ బడితే
ఆ అప్పు తీరదు ఆ అప్పు తీరదు ||జీత మింత||
పర్సులోన క్రెడిట్ కార్డు పరువు కాదురా
ఏదో ఒకరోజు ..
అడవిలో పోరు ముగిసిపోవచ్చు
బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల గర్భశోకం
ఎడతెగని ఊటగెడ్డలా పారుతూంటుంది
నుదుట పొద్దులు రాలిపోయాక -
బతుకుపొడుగునా రుతువులు
కన్నీటిపూలు పూస్తుంటాయి
ఓ నాలుగు పసికళ్లు ..
నేను కాషాయ దేశ భక్తను..
కర్కశ దేశ భక్తను..
నాలోని దేశభక్తి
హింసను ప్రేమిస్తుంది
ధ్వంసను ప్రేరేపిస్తుంది!
నా దేశభక్తి నిరూపించుకోవాలంటే
కత్తి మొనకు విద్వేషం పూనాల్సిందే!
దేశంనిండా ఒకే ఒక మతం కోసం
లౌకికవ
చూపులకు సంకెళ్ళు లేవు
కలలకు సరిహద్దులు లేవు
కళ్ళు మూసుకుని
ప్రతి రోజూ కచేరీకి వెళ్తాను
సితార్, షహనాయీల
జుగల్బందీ వినడానికి
కానీ
సితార తీగలు తెగిపోయాయి
షహనాయీ గొంతు మూగవోయింది
<
నాన్నొక అబద్దాల పుట్ట
కడుపు ఖాళీగా ఉన్నా
చెంబెడు నీళ్ళతో నింపి
పొట్ట నిండిందంటడు
నాన్నొక నమ్మకద్రోహి
తినుబండారాలింటికి తెచ్చి
తినమని తనకిస్తే
బయటే తిన్నానంటాడు
నాన్నొక మోసకారి
మా కన్నీటిని త
పొరలు పొరలుగా అల్లుకున్న లోగిలి
పైపైన కఠినత్వం..
లోలోన అమతత్వం..
నాన్న ఎప్పుడూ పూర్తిగా ఆవిష్కతం కాని వజ్రాల గని...!
చిన్ననాడు నీ ఆటపాటలని
వీపున మోసిన గుర్రపు స్వారి
నువు మారాం చేసినపుడు
గుండెలపై ఆడించి
ఓ చీకటి! చూసుకో నీ మొహం
మారింది గాఢంధాకారం
అమ్మ తెరిచిన నయనాలకు
వెలిగింది ఇల్లు దేదీప్యమానం.
పంపకంలో ఒకరికి భవనం
మరొకరికి వ్యాపారం
ఇంట్లో పిన్నవాడినైన నాకు
దక్కింది అమ్మ, వరం.
ఎలా తెంచుకొని వెళ్
సమస్యల సాంధ్యారాగం మొదలై
తిమిరం అలముకుంటున్న సమయం
చింతలు వింతలు పొడిచి
కొన్నిఘడియలు కాలగర్భంలో కలిశాక
ఆకాశం జాబిలి జాడలేని నల్లసముద్రం
ఈ పెంజీకటి హదయవీణ గీతమిది
కోటిఆశల కలికి కళ్లు ఎదురుచూపుల్లో అలిశాక
ఎన్నో ఒత్
ట్రిగ్గర్ మీదనీవేలు
పాయింట్ బ్లాంక్ రేంజ్లో నాతల క్షణం ఆలస్యంలేక
కాల్చిపారేయక
కళ్ళలో ఆబెదురుపాటు ఎందుకు
నువ్వురమ్మంటే రావడానికి
పొమ్మంటే పోవడానికి
నేను గెస్టునో... టూరిస్టునోకాదు...
ఎండాకాలం మోడుబారిన మా బడి శెట్టు
తొలకరికి మారాకు వేస్తుంది
లేత లేత మొగ్గలను తొడుగుతుంది
రంగు రంగుల పూలను పూస్తుంది
అందంగా పూసిన ఆ పూలన్నీ మా బడి పిల్లల ముఖాలేనండి
కొన్ని కొత్త కోయిలలొచ్చి
మా బడి కొమ్మపై వాలి కూ..కూ..ల
మనం మట్టితోనే కదా పెట్టి పుట్టింది
భేదమెరుగక మట్టిలోనే కదా అవధూతలా ఆడుకుంది
మట్టే గ్రౌండు !
ఇంటి మట్టి గోడలను గోటితో పెల్లగించి
ఉగ్గు కన్నా ప్రీతిగా ఆరగించించాం కదా బాల్యంలో
అనగనగా మనం ఉన్నది మట్టి ఇండ్లలోనే కదా
జాబిల్లి సిగ్గు పడుతోంది
నిస్సిగ్గుగా విలువలనెడి వలువలను
వదిలేసి వెకిలి చేష్టలు చేస్తూ
వయ్యారాలు పోతున్న
వగలమారి లోకులను చూసి...
తారలు తల్లడిల్లిపోతున్నాయి
పట్టపగలు పగలబడి నవ్వుతూ
వెటకారపు ఈటెల వంటి మాటలత
పారదర్శకత ప్రవేశించిందంటారు
మానవ సూచీ అంకెల మీద
అప్పుడప్పుడు పరిమళమద్ది చూపెడుతుంటారు
వాహక సూచీలెన్ని రూపాలెత్తినా
వ్యూహకర్తను బట్టే ప్రదర్శన ఉంటుంది
అంతా అరచేతిలోకి
ఒదిగి పోయిందని
మెరుపుల తెరమీద
మౌజ
ఆ కన్నులు
మాటలాడుతాయి..
ఆ రెండు కన్నులు ఏకమై
మౌనంగా ఎన్నెన్నో గంపలకొద్దీ
ముచ్చట్లను మోసుకు తిరుగుతాయి..
పలకలేని చోట
పదునైన ఆలోచన చోట
రెప్పలను ఆడిస్తూ
ఎన్నో ఖాళీలను పూరిస్తాయి .
వాడిపోయిన
నన్నెట్లా మాట్లాడమంటావ్?
అ.. నా నోరు పెగలదు
నిప్పు పెట్టందే
నా కడుపు చల్లారదు!
విద్వేష వాక్యాలే
నాకు కంఠో పాఠాలు
మీరిట్లా నిషేధం విధిస్తే నోరాడదు!
కూల్చే భాష
నాల్కలు కోసే భాష
నా
సంపద ఎక్కువ అయ్యాక
సుపుత్రులు తల్లి తండ్రుల జాడ నుండి
జారిపోయి దుర్పుత్రుల అవతారం
ఏ సమయాన ఏ పాపం మోసుకొస్తారో...
సదువుకుంటే కదా సంస్కారం
పట్టాలన్నీ ప్రయివేట్ వేలంలో కొన్నవే
టైం పాస కే కాలేజీ గీలేజి కానీ
నిశి మత్తులో
'రాత్రి' గురకపెట్టే వేళలో
హఠాత్తుగా తలుపుకొడుతున్న
గాలి గొంతుకు గది ఉలిక్కిపడింది.
వెలుతురుతో
కళ్ళు తుడుచుకున్న 'నిద్ర'
తలుపు సందు నుండి
బయటకు చూసింది.
ఆకాశపు చీకటి ఒంటిపై
మెరుప
ఆంక్షల వలయంలో
నేను చిక్కుకున్నాను!
మర యంత్రంగా మారి
తిరుగుతున్నాను!
మాట్లాడే నా నోటికి
తాళం వేశారు!
వినే నా చెవ్వుల్లో సీసం పోసారు!
నడిచే నా కాళ్లకు సంకెళ్ళున్నాయి!
పనిచేసే నా చేతులకు బేడీలున్నాయి!
మనిషి జీవనం ప్రకృతి ఆవరణం
ప్రకృతి వైపరిత్యం మన జీవన విధానం
వాగువంక చెట్టు చేమ మాయం
ఋతుక్రమం పేరుకే లిఖితం
అవసరాలకు మించిన భోగం
స్వయంకత అపరాధం
భూమాతకు కాకూడదు భారం
ఆ దిశగా మనిషిగా నీ కర్తవ్యం
ప్రకతి సంపదన
పుట్టినందుకు కాదు.. మానవత్వం లేనందుకు
వ్యక్తిగా పెరిగినందుకు కాదు.. పగ, ప్రతీకారం నేర్చినందుకు
ఎదిగిన యువతలో నేడు.. నైతికత విలువలు కరువైనందుకు
సిమాజమా.. సిగ్గుపడు
తోటివారు తగువులాడితే... తందానా చూసినందుకు
బయటమాత్రం బడాయి మ
అక్కడ కొందరు
చెలిమెను తవ్వుతున్నట్టు కనిపిస్తారు
దాహం తీర్చుకోవడానకి అని మనం అనుకుంటాం
కాస్త సహాయం కూడా చేద్దాం అనుకుంటాం మనం
అందులో నీళ్ళు వాళ్లకు రుచించవు
ఇంకా దేనికోసమో తవ్వుతునే ఉంటారు
మనం ఆశ్చ ర్యంగా చూస్త
చుక్కల పై పొరను
ఎవరో వలిచేస్తున్నట్టున్నారు
ఆకాశం నల్లగా నిగనిగలాడుతోంది
క్రితం గోడకు
ఎవరెవరో వెల్ల వేస్తూనే వున్నారు
క్షణానికో రూపాన నిలబడిపోతూ
అసలు జాడను మరుగుపరుచుకుంది
కుండీలో మొక్కను
నాటిన వ
తెంపితే తెగిపోవడానికి దారం గాదు
తగులబెడితే బూడిదై పోవడానికి కట్టేగాదు
ఊదితే పగిలిపోవడానికి గాలిబుడుగ గాదు
కుదిపితే కూలిపోవడానికి బర్లకొట్టం గాదు
అతనొక మేరు పర్వతం
దేశానికి తోవ చూపిన నేత
పరిపాలనకై
సంవిధానా
పునాది పడ్డమంటే
దున్నీ చదును చేసిన పొలంలో
విత్తులు వేసినట్టే
గోడలు మొలుస్తుంటే
చినుకు కడుపులో
ఇంద్రధనుస్సు పడ్డట్టే
కాగితంలో గీసుకున్న గీతలు
నేల మీదకు వాలుతుంటే
ప్రసూతి గది బయట
పచార్లు చేసే భర్
బకాయిలు తీర్చలేక...
బ్రతుకు మోయలేక...
పండుటాకులా పుడమికొరుగుతూ...
విగతజీవులుగ మారుతున్న రైతన్నలను...
నీ కన్నులారా కనవమ్మా...
అందరి ఆకలి తీర్చే రైతన్న..
పట్టెడన్నం కోసం పొట్ట చేతపట్టుకొని...
పట్టణాలకి పరుగులెడుతుం
మండే
బొగ్గు గుణం కార్మికుడికే ఎరుక
భగభగ మండే
నిప్పు గుణమూ
శ్రామికుడికే బాగా ఎరుక...
నెత్తురు, చెమటను ధారపోసి
నైపుణ్యాన్ని ఒలకపోసి
సకల రకాల వస్తువులను ప్రతిష్ట చేసి
సామాన్యుడిగా జీవించడం
తనకే తెల
నాలోని సూర్యుళ్ళను మింగేశారు వారు
నాలో ఉదయించే
సముద్రాలను తుడిచేశారు
ఉరికే సాయంత్రాలను
నిశ్చలమైన మధ్యాహ్నాలను
చీకట్లల్లో వివస్త్రను గావించేశారు
అమాయకపు శుభ్రమైన మొఖంతో
ఆకాశాన్ని చూస్తున్నప్పుడు
బంగా
ఆవలి చీమలు ఈవలికిదూరకుండా
అనుక్షణం సైనికులు కావలి కాస్తరు!
అంగుళం జాగా అన్యా క్రాంతం కాకుండా
అపమ్ర త్తంగా విహంగ వీక్షణం చేస్తరు!!
ఆలుబిడ్డలను ఇరుగుపొరుగుకొదిలి
ఆయుధాలతో దోస్తీజబర్దస్త్ గ చేస్తరు!
దివ
వజ్రోత్సవ స్వతంత్ర భారతి
వందల దేశాల మధ్య
ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని
ఆకాశంనిండా ఎగరేస్తుంటే..,
అంత గొప్ప రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్...
మన నేతని..,రొమ్ము విరుచుకోకపోగ...,
పచ్చని ఆ సీమలో అగ్గిపుట్టిస్తర..,
చల
నిన్నెందుకో అతడు రాలేదు
నల్లమబ్బు ఒంపే చీకటికి
రవికిరణపు మెరుపుకు
నడుమ జరిగే
సంభాషణల సందిగ్ధతల మధ్యన
నింగి నలుగుతోంది
ఎండిన దేహంతో అల్లాడుతున్న నేల
మేఘం ఒంపే క్షీరధారలకై
ఆవురావురంటోంది
గాయాలు నడుస్తాయి
గాయాలు నవ్వుతాయి
గాయాలు ఏడుస్తాయి
శీతోష్ణ సుఖదుఃఖాలకు
చలించే గాయాలు
ఈ భూమ్మీద
ఇంకా సజీవంగానే ఉన్నాయి.
ఒకింత మాంసం
ఒకింత చీమూ నెత్తురు
కలగలిసిన గాయాలీ
రంగస్థలంపై