Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నది ఉప్పొంగి ఎగిసివచ్చి
ఆత్మతో ఆప్యాయంగా
నా పాదాల్ని ముంచెత్తిన రోజున
నన్ను నేను తెల్సుకున్నాను
అద్దం అబద్దం చెప్పదు
నీళ్ళు నిలకడగా వుండవు
నా నీలం రంగు కళ్ళు
పచ్చదనాన్ని కలగంటున్నాయి
చెవులేమో నీటి అలల
సంగీతాన్ని వింటున్నాయి
నడిచినంత మేరా
ఇసుకలో నా పాదముద్రలు
గడ్డకట్టిన అనుభవాలు
గడిచినకాలపు ఆనవాళ్ళు
జ్ఞాపకాల్ని వెంటేసుకుని
నది నెమ్మదిగా కదిలిపోతున్నది
నేనిట్లా నిలబడి పోయాను
మరో నదిని కలగంటూ..
- వారాల ఆనంద్, 9440501281