పోయెట్రీ
పసితనంలో కన్నోళ్ళను కోల్పోయి
నడీడులో సాదుకున్నోళ్ళను విడిచి
బతకుదెరువుకోసం 'దేశం' పోయిండని తెలిసినప్పుడు
నాన్నెందుకో నాకు నచ్చలేదు
ఆకలికి పేగుల్ని పోగులు పోగులుగా
రాట్నంతో వడికి
కండలను కండెలుగా చేసి వొంటిచేత్త
ఇంకా పాల బిల్లు పైసలు రాక
పాలవాడు తెల్లమొహమేస్తే,
కిరాణా బిల్లు అందక కొట్టువాడు
ఆ బాధను తట్టుకోలేకపోతుండు..
ఇంకా సారు జీతమియ్యలేదని
ధోభీవాడు భోరుమంటుంటే
సంసారబండిని అతికష్టమ్మీద నెట్టుతున్న
పనిమనిషి దుడ్లు
నాకన్నా పొడవయిన నా నీడ
నేలమీద వాలి కూలిన ఆశల గురించీ
కాటగల్సిన కలల గురించీ తలపోస్తున్నది
ఎండిపోయిన నేలంతా ఎడారి వాసన
...........
దుఃఖంలో
తడిసి ముద్దయిన కళ్ళు
కలలుగనడం నేర్చుకుంటున్నాయి
......
నేరానికి
నిదురనో
మెలకువనో అర్థంకాని ఊగిసలాటగా కలవరపెడుతూనె
కళ్ళ ఆకురాళ్ళపై
కత్తులు నూరుతుంది
రాత్రి
ఒక్కుమ్మడిగా
తలలోకి చొరబడిన
కురులన్నీ
గజిబిజిగా
అల్లుకుపోతాయి.
విడదీయరాని చిక్కు.. చిరాకు..
ఆ కన్నులు
మాటలాడుతాయి..
ఆ రెండు కన్నులు ఏకమై
మౌనంగా ఎన్నెన్నో గంపలకొద్దీ
ముచ్చట్లను మోసుకు తిరుగుతాయి..
పలకలేని చోట
పదునైన ఆలోచన చోట
రెప్పలను ఆడిస్తూ
ఎన్నో ఖాళీలను పూరిస్తాయి..
వాడిపోయిన
రిక్టర్ స్కేల్ లాంటి ఓ పరికరాన్ని
కనిపెడితే బావుండు
మరిచిపో అన్న మాటకి
నా హదయమెంత కంపించిందో !!
బీటలు బారి తనువుని ఎంత చీల్చిందో !!
కమిలి కుమిలి కన్నీరుని జార్చకుండా
జాగరణ చేసిన కన్నులని అడగాలి
అక్షరానికి వల వేయకు అదే నీకు వలౌతుంది అక్షరాన్ని వంచించకు నిన్నే బలి తీసుకుంటుంది అక్షరాన్ని ఆడించాలనుకోకు నువ్వు ఆటవై పోతావ్ నాగరికతా నట రాజసాలు లౌక్యజీవిత మురికి కూపాలు అక్షరానికి ఆపాదించకు నువ్వు అగడ్త పాలౌతావ్
అక్షరాన్ని ప్రే
పల్లెకు కాళ్ళుండవు
మన దగ్గరకు నడచి రావడానికి
దానికి మనసుంటది
మన కోసం ఎదురు చూస్తుంటుంది!
కారణం ఏదైనా కాని
పండగో పబ్బమో
జాతరో తీరని యాతనో
అప్పుడప్పుడు ఊరెళ్ళి వస్తుండాలి!
అది ఇప్పుడు
చివికిన
ఆకలిగొన్న పేదల డొక్కలు
అడుక్కు తింటున్న బాలుడి రెక్కలు
పంటి కింద దాచిన పడతి బాధలు సాక్షిగా
ఈ రాజ్యం విఫలమైందంటాను....!
చెరచబడ్డ స్త్రీ అరుపులు
ఖూనీ చేయబడ్డ అమాయకుడి పిడికిలి
అన్యాయానికి గురవుతున్న గుడిసెల కథలే
పొద్దుకు నడక నేర్పే
చల్లని అడుగు
కాలం పరీక్ష పెట్టినా
వెనుకంజ వేయని
నిరంతర ప్రయాణం...
పంట చేల చుట్టూ అల్లుకునే
ఆలోచనల సవ్వడిలో
అతనిది ఆకలి తీర్చే అమ్మతనం
తనకేమి మిగులుతుందని
కాదు చింత
మ
ఫలితాలు వెలుబడి ఓడిపోయాక
ప్రయత్నం వేళ్ల నుండి మొదలు పెట్టాలి
కారణాలు తొడుతూ కామెంట్ చేయొద్దు...
వెనకాల నవ్వులు తాకుతుంటాయి
తిరిగి చూసేంత సమయం ఎక్కడిది
నడవాల్సినది కోటి కోసులుంది ముందు ముందూ
అవమానమని
అహంకారానికి,
ఆత్మ గౌరవానికి నడుమ ఓ యుద్ధం జరుగుతోంది,
ఆధిపత్యానికో,
అది ఏ పైత్యానికో,
అర్థం కాని లోకం ఆద్యంతం చోద్యంగా వీక్షిస్తోంది,
గగన తలాన మత్యు లోహ విహం ''గద్దలు'' ఎగరడం చూసి,
బంకర్లో దాగిన ఓ తల్లి
ఇంకా
ఈ గాయాల చరిత్రని చదవాలని లేదు
ఈ లోయల దారులేంటా నడవాలని లేదు
నా వారసత్వ నెత్తుటి ముద్దల్నిచూడాలనిలేదు
గతం పేజీలు తిరిగేసినపుడల్లా
కన్నీళ్లు పేరాల ధారలై వెక్కిరిస్తున్నయి
అడుగు మోపినపుడల్లా వాళ్ళ
గుం
బాలకాండలూ
సుందరకాండలూ ముగిసిపోయాయి
దేశంలో ఇప్పుడు గురివిందకాండ నడుస్తుంది!
దేవుడుగా చలామణి అవుతూ
దేవుణ్ణి నేను కాదు ఇంకొకరున్నారనటం
నేనే దేవుడ్ని
సమస్త జీవజలాలూ
నాలో నిక్షప్తమై ఉన్నాయన్న నిజానిజాలూ
నేత
పండ్లోయమ్మా పండ్లూ
తీయని,పుల్లని,వగరు రుచులతో
పండ్లోయమ్మ పండ్లూ...
పండ్లోయమ్మా,పండ్లూ
ఎరుపూ,తెలుపూ,పసుపూ,నలుపూ,ఆకుపచ్చని రంగుల పండ్లు
పండ్లోయమ్మా,పండ్లూ
పెరట్లో,తోటలో,చేలగట్లపై
పూసేకాసే పండ్లచెట్లపై<
పసితనం నింపుకొచ్చిన అవ్వ
మొగుడుతో పోట్లాట పెట్టుకొని
అంగట్లో బారేమాడుతుంది..,
బట్టలకొట్టు మల్లి గాని దగ్గర
పచ్చసీర కొనెదానికి
ఆ కొంగు కొస్సకు.,
ఆఠాణా బిళ్ళలు మాదిరి
అక్షరాలను ముడేసినట్టుంది..,
తన అను
నిన్నంతా ఒక్క యుద్ధ వార్త కూడా
చదవలేదు
నన్ను నేను చూసుకుంటూ గడిపాను
నేనిప్పుడు నగరాల శ్మశానాల్లోంచి
పరుగు పెడుతున్న శవాన్ని
మైనస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్..
గడ్డ కట్టిన దేహాన్ని లాగుతున్న
నెలవంకను
పగబడితేనే
నేల మీద
నిలబడుతాడు
ఆకుపచ్చను
ఒడిపెడితేనే
అధికారం
ఒడిలో కూర్చుంటాడు
మనుషుల్ని
మతంకత్తితో
మట్టిలో మట్టి చేసే
వాడిజి
విద్వేష బుల్డోజరు
మాసినగడ్డాల
బయటే కాదు
నీ లోపల కూడా నువ్వు ఒక తోటను పెంచుకోవచ్చు
అందుకు లోపల కొంచెం సారవంతమైన జాగా వుండాలి
లేదా నువ్వే ఏర్పాటు చేసుకోవాలి
చేతులకు మట్టి పని తెలియాలి లేదా నేర్చుకోవాలి
తెలిసీ లేదా నేర్చుకుని బయట పని చేస్తున్నపుడే<
రేయనక పగలనక
ఆరుగాలం పడ్డ శ్రమను అపహాస్యం చేసి
బొక్కలెల్లిన మాపై ఉక్కుపాదమై
మీరు తొక్కనీకి జూస్తున్నరు
వడ్లు కొనమని ఒకడు
నూకలు తినమని ఇంకొకడు
రోజూ ఎగతాళి జేస్తున్నరు
మా తాతల ముత్తాతల నుంచి
మావి ఎండిన బత
ఉదయించే సూర్యుడు
ఉష్ణ రక్తకాసారంలో మండుతున్న గుండె
గురిచూసి వదులుతున్న బాణపు దిశ
అతనెప్పుడూ తూరుపుదిక్కే
ప్రశ్నించే గొంతుక
నిట్టనిలువునా చీలే నియంతృత్వం
నివురుగప్పిన జ్వలించే నిజం
వాడెప్పుడూ దక్షిణంవైపే
ఎవరిది
అచ్చం నా నీడలాగే వుంది
నా నరాల్లో రక్తమై పారుతున్న కవిత్వం
కొద్దికొద్దిగా చెదల కొరుక తింటూ....
నా నుంచి దూరం చేయడానికి,
బలంగా కవిత్వాన్ని శూన్య పరచడానికి
అచ్చం నా నీడలాగే వుంది-
మిత్రవాక్యంలా తోడుగా
ఎర్రనిజెండాలెగరేద్దాం
నింగిన చుక్కలు నవ్వేలా
శ్రమదోపిడినీ ఎదిరిద్దాం
శ్రామికలోకం మురిసేలా
పదండి శ్రామిక సోదరులారా
పదండి కార్మిక కర్షకులారా...
మేడే వర్ధిల్లాలీ... మేడే వర్ధిల్లాలీ...
పోరాడి సాధించుకున్నము<
ఇద్దరిదీ
ఒకే వీధి
శాస్త్రవేత్త ఇంటి నుండి
రెండడుగులు ముందుకు వేస్తే
కవి ఇల్లు
కవి ఇంటి నుండి
రెండడుగులు వెనక్కి నడిస్తే
శాస్త్రవేత్త ఇల్లు
నూకలు వేసి
పిట్టల్ని పిలుస్తూ
కవి ఎప్పుడూ గు
అందమైన హారంలో కనిపించని
దారం నా దేశం!
మాలకట్టే ఈ దారానికి
అందరు సమానమే!
వర్ణవివక్షతను చూపని
ఈ దారం అందరిని
ఒకటిగ కలుపుతుంది!
కులం కుంపటిని రాజేసేవారిని
దూరంగా ఉంచమంటుంది!
మతం రంగును పులుముకున్న <
ప్రియా....
తడి ఆరని నా కనుపాపల మాటున
మసకబారిన నీ రూపం దాగివుంది...
తెల వారని నా ఆశల వాకిట
దరిచేరని నీ తలపు నిలిచి ఉంది...
గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని
మది నిండా వ్యాపకం పొదుపుకుని
నీకు దూరమై ఒంటరిగా బ్రతి
బర్కత్ల రంజాన్ కోసం
రహీంచాచా
ఏడాది ఎదురుచూపు
మరో ఏడాది కొనసాగింపుకే
ఖర్జూరమే కావాలా
ఏ ఉప్పుగల్‌లో
ఇఫ్తార్‌ను పూర్తిచేయకపోదు
నిమ్మకాయలేనా దాహార్తిని తీర్చేది
రోజంతటి రోజాకు
చిత్రంగా చేపలు ఆకాశంలో ఈదుతున్నాయి
కప్పలు అరుస్తున్నాయి కూడ
సూర్యడు చంద్రుడు నాటుపడవెక్కుతునట్టు
తడబడుతున్నారు
అర్థమయింది
ఆకాశాన్ని కత్తిరించి
ఎవరో ఊరి చెరువులోకి విసిరేసినట్టున్నారు
నిత్యం చీకటిని నెమరేస
తను తన బాల్యాన్నంతా
ఓ పెట్టెలో కట్టి పెట్టేసింది
ఆ పెట్టెకు తనకు ఉన్న చుట్టరికం
ఈనాటిది కాదు
నేను నా కవితలన్నింటిని
అట్టలూడిన పుస్తకంలో పోగేసుకున్నట్టు
తన చిన్ననాటి అనుభవాలన్నింటిని
చూడచక్కని ఛాయాచిత్రాలుగ
నెలవంక రాతిరి
నిదురను దోచింది
కనురెప్పల పాట
మనసును తాకింది !
నడిరేయి జాములో
కొలిక్కి రాని వాక్యాలు
పురిటి నొప్పుల్లో
సంధి కొడుతున్న భావాలు !
పీడ కలగన్న ఏ పిట్టో
పల్లవి లేని పాట ఆలపించింది
నేను మనిషి దగ్గర
నిలబడి మాట్లాడతాను
మతం దగ్గరో కులం దగ్గరో
ఒకానొక ప్రాంతం దగ్గరో
నిలబడి మాట్లాడను
నేను మనిషి దగ్గరే
నిలబడి మాట్లాడతాను
అనేకానేక భావోద్వేగాల సంచయమైన
రక్త మాంసాలున్న మనిషి నా చిరునామా
1. కొన్ని సమయాలు ఏమీ బాగుండవు !
2. రేపటి మీది ఆశతోనే
ప్రతి రాత్రికీ వీడ్కోలు పలుకుతాను
ఇప్పటిదాకా ఇసుర్రాయి కింద నలిగిన సమయాలన్నీ
ఏ జ్ఞాపకాన్నీ రాల్చలేకపోయాక
క్రితందాకా తర్జనభర్జన పడ్డ క్షణాలన్నీ
ఏ చిరునవ్వు
ఓ
నా ప్రియమైన వేటగాడా ..
నన్నో నెత్తుటి పిట్టను జేసీ
వేటాడితే వేటాడావు సరే ..!
నేలకొరిగే ముందు
నాదో చివరి కోరిక !
నా నెత్తురు విత్తుల్ని జేసీ
పొలాల్లోనూ..
పర్వతసానువుల్లోనూ..
అడవుల
మొన్న
కొన్ని పడవలను చూసాను
సముద్ర కెరటాల
కత్తుల దాడిని ఎదుర్కుంటూ
ఒడుపుగా తల్లక్రిందులవకుండా
తప్పించుకుంటూ...
పొట్ట కూటికై
నీటిగర్భాన్ని తెడ్లతో పొడిచి
అదుపు చేస్తూ
తెరలు తెరలుగా
తుళ్ళి
1. వారన్నారు -
సత్యం ఎప్పుడూ
నాకు ఎదురుగానో
పక్క పక్కనే నడుస్తూనో
నాకు సమీపంగా కూర్చొని
నా సమక్షంలో నన్ను క్రీగంట వీక్షిస్తూనో
నేను కావ్యాలతో సంభాషిస్తూ ఉంటే
తలుపు పక్కన నిలబడి
చూపులతో దాగుడుమూతలాడుతూ
ఛిద్రమైన
బతుకు దాహపు అడుగు
నెత్తురుమంచుబిందువుల
గులాభిరెమ్మలు
మట్టిరేణువుశిలాజాలు
కొన్ని కన్నీళ్లు
పక్షిఈకలగౌను చిరిగిపోయి
చితికి చెదిరిన
లేత నవ్వుల పుప్పొడి
విరిగి కుప్పకూలిన ఆ
తన పేరే స్వరాజ్యం
తలవగానే చైతన్యం
తరలిపోయె తల్లితాను
పోరాడి జీవితాంతం
పద్నాలుగు ఏళ్ల వయసు
బందూకు పట్టి తాను
పీడన ఎదిరించింది
దొరల పీచమణచింది
భూస్వాముల బిడ్డయినా
బానిసలకు నాయికగా
బర
నా కున్న ఆ రెండు కళ్ళు
మా ఊరికున్న నీళ్ళ చెలిమెలు/
నా నుదుటి మీద మెరిసే బొట్టు అది
మా ఊరిని ఆదుకునే జోగినాథుడనే ఆపద్భాందవు/
నా శిరస్సుపైన నిలిచిన శిఖరం
అది మా ఊరి నడిబొడ్డున
నిలబడిన మద్దిరంగం/
నా కున్న రెండు చేత
ఒక ఉదయం
గడియారాన్ని ముఖానికి అతికించుకుని
హడావిడిగా రోడ్డు దాటుతున్నప్పుడు
ఆమె తళుక్కున మెరిసింది
కళ్ళచూరు నుండి జారిన
ఒక్క పలకరింపు చినుకు
హదయంలో
ఎన్ని వేకువలను రగిలించిందో
చిన్నప్పుడు
కలిసి ఆటలాడుకు
ఎప్పుడైనా రంగులరాట్నం పై పిల్లల కేరింతలు గమనించావా?
లేదా - వర్షపు నీరు, నేలను తాకి చేసే అల్లరి విన్నావా?
రికామీగా ఎగిరే సీతాకోకల వెనుక సరదాగా పరిగెత్తావా?
రాత్రి చీకటిలోకి జారిపోయే రవి బింబాన్ని
నువ్వు కంటి చూపుతో స్పర్శించా
నేనైన నేను..
నీవు కాని నీతో మాట్లాడుతున్నాను.
కొంత అర్థమయ్యి,
కొంత అర్థంకాక
కనబడే నీకు..
పూర్తి అర్థాన్నిచ్చే వాక్యంలాగా
వినబడుతుంటాను.
అపుడే కనిపించి,
అపుడే మాయమయ్యే
ప్రశ్నలాంటి నీ దశ్యానికి
జవ
మీరు నన్ను చరిత అట్టడుగు పుటల్లోకి
నెట్టే దాచేసే ప్రయత్నం చేయొచ్చు
అనుమానాలతో అవమానాలతో
నా జీవితాన్ని బంధించి
బెడ్ రూమ్ కు కిచెన్ కు మధ్య
చిలువలుపలువలుగా
విస్తరింపజేయొచ్చు
పురుషాధిక్యతను <
నిశ్శబ్దంగా నన్ను నేనే ముందేసుకొని
పదేపదే చదువుకొంటున్నాను
లోపలి పేజిల్ని ఆరగా ఆరగా
బిగ్గరగా చదువుకొంటూవుంటాను
కొన్ని పేజీలు అప్పుడే
అచ్చులోంచి వచ్చినంత తాజావాసనల్తో
మరికొన్ని పేజీలు
చెదపట్టి చివికిపోయి పాతవాసనల్
విరిబాల వంటి సుకుమారం
మనసు నిండా మమకారం
నిండైన ఆత్మ స్థైర్యం...
ఆశయ సాధనలో మొక్కవోని ధైర్యం..
సహనం హద్దులు దాటితే మాత్రం.. దాల్చుతుంది ఉగ్రరూపం.
అయినా అనాదిగా వంటింటి కే
పరిమితం!
కానీ..
కాస్సేపు నీ ఇగోని పక్
'అడ్రసు చెప్పు' అన్నాను.
'అదంతా ఎందుకు
రూట్ మ్యాప్ పంపిస్తా వచ్చేయ్యి' అన్నాడు మిత్రుడు.
బస్సయినా
కారయినా
అదొక సుఖగమనం
నా కయితే కదిలే కవిత్వం.
కారు బయల్దేరింది
'200 మీటర్ల తర్వత
అదుగో ఎవడో
శత్రువేమో!
రాళ్లు విసరండి!
చంపండి!!
అదుగో ఎవడో రాక్షసుడు,
నల్లగా వున్నాడు, శత్రువే!
విల్లంబులు తియ్యండి!
బల్లేలు విసరండి!
కుళ్ల బొడవండి!
అదిగో ఎవడో
మన మతం గాని వాడు!
కత్
చలి చీమలు
మబ్బులు గుమిగూడినట్లు
మెల్ల మెల్లగా సమావేశమవుతున్నాయి
దేశంలోకి బలవంతమైన సర్పమొకటి జొరబడ్డదని!
చీమల్ని విడదీసి వెంటాడి
వేటాడుతున్న సర్పం
అఖండ భారతాన్ని కలగంటున్నది!
ముప్పును పసి గట్టిన చీమలు
ఒక్కటై
మట్టిది అయినా ఫరవాలేదు
మనది అయితే బాగుండు
ఎత్తు తక్కువ అయినా
అడుగు అడుగులో ఆత్మ కనపడేది..
చూసినప్పుడల్లా చైనా వోని
పుల్వమా ద్రోహం గుర్తుకు వచ్చే
కోట్లు అప్పనంగా అర్పించి
మనవాళ్ళ మీదకే మళ్లీ దాడి....
తల్లి భూదేవికి పిల్లలంటే ప్రేమ
మట్టిపై, నీటిలో జీవజాలమంతా తన పిల్లలే
కడుపులో ముప్పావు కన్నీటి సముద్రాలున్నా
ధైర్యంగా జీవనం, మంచి కోసమే మధనం
అత్యాశ నిచ్చెనలు ఆకాశానికి వేయలే
బాధల ఉప్పునీళ్లు తనలోనే దాచుకొని
మంచి నీటి ఆ
అతడు...
నడిగూడెం శనగసేల ఎర్రసెలకలమీంచి
పచ్చపచ్చగా పూసిన తంగేడు పూల గొడుగు కిందనుంచి
ఒకచేత్తో ముండ్లకర్రను త్రిశూలంలా పట్టుకొని
మరోచేత్తోడమరుకాన్ని
దిగంతాలు మారుమ్రోగేలా మోగిస్తూ...
నలుదిక్కుల్ని ఆలింగనం చేసుకొని