Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైల్లలో ఉరితాళ్లు ఊరకే మూల్గుతున్నాయి !!
కీచకుల మెడలో పడకుండా
దూరం దూరంగా నెట్టి వేయబడుతున్నాయి !
క్షమా భిక్షలు పాత్రలో నింపుకుని
వ్యూహంగా ఉరితాళ్లను తప్పించుకుని
ఏనుగు పై అంబారిలో ఊరేగుతున్నాయి మెడలు
కండ్లకున్న పట్టి విప్పుకోని అవేశంగా ఆదర్శంగా
న్యాయ దేవతకు లోక ''ప్రీతి''గా ఉరిశిక్షలు
అమలు చేయలని అనుకున్నా
అన్నీ కంటకాలుగా అధికరణాలే !
అహింసా సూత్రాలే !
దేశమంతా ఉరి పడని మెడలు ఎన్నో
పూల దండలు వేసుకుని స్వేచ్ఛగా
ఊపిరిని పీల్చుకుంటున్నాయి !
ఉరితాళ్లు సిగ్గుగా పోగులుపోగులై
పేరుకు రాకుండా పోతున్నాయి !
పేరుకే ఉరితాళ్లు ??
- కందాళై రాఘవాచార్య, 8790593638