Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక నాటికి బడికీ నీకూ
బంధం తెగిపోతుంది
గింజుకున్నా నిన్నురానివ్వరు
ఒక ఒడుపైన సమయంలో
నిన్ను యవ్వనం త్యజిస్తుంది
సకాలంలో ఎవ్వరినీ మోహించని సంగతి
దానికి పట్టదు
అంతలోనే ఉద్యోగం
వయసు మిషగా నిన్ను ఒద్దంటుంది
ఆశ్చర్యం లేదు
ఒక వయసొచ్చాక
ఇంటివాళ్ళెవ్వరికీ
నువ్వవసరం లేదు
నీ మనసుకు
పాతబడ్డ నువ్వవసరంలేనప్పుడు
నీ శ్వాస నిస్సంకోచంగా
జారుకుంటుంది
- ఏనుగు నరసింహారెడ్డి
8878869183