Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి :
కనులలోని కాంతులను.. మనసులోని మమతలను
మురిపెములుగ కలబోసి.. తన సర్వము పెనవేసి
సృష్టికి ప్రతి సృష్టి చేసెనే.. అమ్మ ఒడి స్వర్గము
తలపింపచేసెనే.. ||కనుల||
చరణం 1 :
చిరు ప్రాయపు బోసినవ్వు.. చిరు మువ్వల సవ్వడులు..
దోబూచుల దొంగాటలు .. చిలక పలుకు గారాలు..
అడుగడుగున సంబరాలతో.. అమ్మ..
మది నిండుగ పులకించెనే
చరణం 2 :
చందమామ కాంతులలో .. గోరుముద్దలు మురిపాలు
లాలిపాట మధురిమలు.. పవళింపు సేవలు..
తప్పటడుగు బుజ్జాయితో .. అమ్మ
వేయి కనులు దివిటీలాయెనే ||అమ్మ|| ||కనుల||
చరణం 3 :
మారాలు.. గారాలు బుంగ మూతి చందాలు
ఆట పాట చదువులతో .. ఏటేటా బహుమతులు
శ్రమ తానే మరచెనులే.. అమ్మ..
మనసు తీర మురిసేనులే ||అమ్మ|| ||కనుల||
చరణం 4 :
తన ఇల్లే .. తన స్వర్గం.. తన పిల్లలే తన ప్రపంచం
ఆశయాలు కలలన్నీ ఊపిరిగా మలచుకొని
ప్రాణమంత నిలిపేనులే ..
అమ్మ మమతలెన్నో పంచేనులే ..
అమ్మ ఋణమెపుడూ తీర్చలేనిదే ||అమ్మ|| ||కనుల||
- విజయ భారతి, 9052445001