Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీవిక్కడ ఉన్నది వాస్తవిక
అవాస్తవ నిశ్చిల అనిశ్చిత స్థితి
ఎంతకాలం ఈ స్థితిలో....
గొంగళి పురుగుకి
సీతాకోక చిలుకగా మారేందుకు
కొంత కాలం ఉంది
నువ్వు నిజంగా మనిషిగా
పరిపూర్ణ మనిషిగా మారేందుకు
నీ ఈ జన్మ సరిపోదు.. మరో జన్మ లేదు
నువ్వనుకుంటావ్ ....
ఇదో పెద్ద ట్రాష్.... అని
ముసలోల్లు మాట్లాడుతుంటారు అని.. నేనూ అలానే
కానీ వాస్తవం... నువ్విక్కడకు రెంట్ కొచ్చావని
అద్దె కట్టేసి అద్ధాన్తరంగా....వెళ్లిపోవాల్సిందే
కానీ నాదో చిన్న రిక్వెస్ట్
నువ్వు ఓపికున్నంతవరకు
పరులకు సాయం చేయమని
నీకు ఓ సాయం సంద్యలోనో
ఓ ప్రభాత ఉదయంలోనో
అనిపించక మానదు
ఎందుకంటే... నువ్వు
ఇప్పుడున్నావ్ ... రేపుండవేమో
నాన్నా లే నాన్నా అని ఎక్కడినుండో
పిలుస్తున్నట్లు నీకన్పిస్తుంది
కానీ నువ్వు లేవలేకపోవచ్చు
ఇవ్వాల్లున్న నువ్వు రేపు ఓ జ్ఞాపకమే
అన్నీ నీకు తెలుసు
నీ అంతరాత్మ చెబుతుంది
యూ ప్లీజ్ లిజన్ యువర్ ఇన్నర్ వాయిస్
నువ్వెల్లకతప్పదు.. ఇది నిశ్చితం..
ఇంకెందుకు... సిగ్గులేని ఆరాటం
వాస్తవంలో జీవించు..
జయలలిత వెయ్యి కోట్ల మహారాణి
పరుండింది ఆరడుగుల శయ్య
బహుభాషా కోవిదుడు
పీవీ ఇపుడేడి
ఆంధ్రుల ఆరాధ్యదైవం
ఎన్టీఆర్ ఎక్కడికెళ్లి పోయెనో కదా
రాగాలతో ఆడుకున్న మన బాలు
కానరాని లోకాలకు వెడలిపోయెను చూడు
నీ కన్న తండ్రి వెళ్ళిపోయింది ఎక్కడికి
ప్రేమ పంచిన తల్లడిల్లిన అమ్మ
కరిగిపోయిన మంచు స్వప్నమే కాదా ఇప్పుడు
కాలనది కఠినంగా గమిస్తుంది
తనతో అన్నిటినీ తరలిస్తుంది
జ్ఞాపకాల మధురాలను
విషాద నిషాదాలను వదిలేసి వెళ్తుంది
నువ్వు మాత్రం ఈ భూమండలమంతా
నాదే అనుకుంటూ బతికేద్దాం అనుకుంటావ్
కానీ ఓ రాత్రి... నెప్పితో విలవిల్లాడతావ్
నీ పక్కనెవరూ వుండరు
అప్పుడు... అనిపిస్తుంది
ఎవరన్నా ఉంటే బాగుండని
కానీ... మెల్లగా... నీకు తెలుస్తుంది
నువ్వు వెళ్ళిపోతున్నది
నీవిక ఎప్పటికీ... ఇంకెప్పటికీ
ఇక్కడికి రావని... నీకు తెలుస్తుంది
నువ్ ప్రేమించినోళ్ళు.. నువ్వంటే పడిచచ్చేటోల్లు
ఎవ్వరూ రారు నీతో.. వాళ్ళకి ఇంకొంత టైముంది
కానీ ఇది వాస్తవం.. ఇది నిజం
ఇప్పుడు చెప్పు.. ఇపుడేం చేద్దామో
ఈ కొన్నాళ్ళ కాలానికి
ఇన్ని కోపతాపాలు, ఆస్తులు, అంతస్తులు,ఇగొలు...
ఇక చాల్లే గానీ...
కొన్ని ప్రేమలు... కొన్ని ప్రియమైన మాటలు..
కొన్ని మనమంటూ ఉన్న క్షణాలు
మనం మనంగా ఇచ్చే జ్ఞాపకాలు..
ఇక చాలు భారు...
బతికేస్తావ్.... యుగాల తరబడి
అందుకే... కొన్ని ముద్రలేసీ వెళ్లిపో.. అంతే
- సవ్యసాచి