Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎటువైపు గమ్యం ఎటువైపు గమనం
గమ్యం ఒకవైపు గమనం మరోవైపు
గమనం లేకుండా గమ్యం చేరుతావా
ఏదైనా ఒక వైపే సాగాలి
రెండు పడవల్లో కాళ్ళు పెడితే
పయనం సాగదు కదా!
అంధకారమని గమనం ఆగిపోతే
గమ్యమనే ఉషోదయ కాంతిరేఖ
కనిపిస్తుందా!
చీకటి పడేవరకు వేచి చూడకుంటే
పండు వెన్నెల కనిపిస్తుందా!
గమ్యం వైపే గమనం సాగాలి
ఎండను తిడుతూ కూర్చుంటే
వర్షం కురుస్తుందా!
శ్రమ ఫలం దక్కాలంటే
కాయ పండేదాకా ఓపిక పట్టాలి కదా!
నీడ పడవద్దు అనుకుంటే
మిట్ట మధ్యాహ్నం వరకు ఆగాలి కదా!
నీ గమ్యం గగనమైన
ఆగని గమనమే మంత్రడండం!
- పి. బక్కారెడ్డి, 9705315250