Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా కన్నీటికి కారణం ఏంటీ?
ఎందుకొస్తోందా.. కన్నీరు?
నాకేం తెలీదనే అమాయకత్వంతో వస్తుందా?
అంతా తెలుసు అనే దీమాతో వస్తుందా?
నా వల్ల ప్రయోజనం లేదనే బాధతో వస్తుందా?
నీనేదైనా చేయగలననే నమ్మకంతో వస్తుందా?
ఏవరైనా ఆలోచిస్తున్నారా! అనే సందేహంతో వస్తుందా?
నీనే ఆలోచిస్తున్నాననే అనుమానంతో వస్తుందా?
సమాజం స్పృహలో లేనందుకు వస్తుందా?
ప్రభుత్వం సచ్చినందుకు వస్తుందా?
యువత రక్తంలో ఉన్న వేడితో కాచిన ఉగ్గుని చాతకాని
తనానికి తాపుతుంటే వస్తుందా?
మంచిని కూనీ చేసినందుకు వస్తుందా?
చెడుని సంకన ఎత్తుకున్నందుకు వస్తుందా?
ఆడవారి జీవితంబలౌతున్నందుకు వస్తుందా?
మగవారి జీవితం బానిసౌతున్నందుకు వస్తుందా?
చిన్న పిల్లల్నీ చివిమేస్తున్నందుకు వస్తుందా?
ముసలోల్లని వదిలేస్తున్నందుకు వస్తుందా?
ఉన్నోడు బలం చూపిస్తున్నందుకు వస్తుందా?
లేనోడు చూపించడానికి ఖాళీ కడుపు తప్పా
ఇకేం లేనందుకు వస్తుందా?
నేరాలు ఎక్కువైనందుకు వస్తుందా?
పెరిగిన ధరల వల్ల వస్తుందా?
తరగని సమస్యల వల్ల వస్తుందా?
ఎందుకు? ఎందుకు? ఈ కన్నీరెందుకో..?
- ఇనుగుర్తి సాయికీర్తి