Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఐసీ బాధ్యునికి బాధిత రైతుల ఫిర్యాదు
నవతెలంగాణ-తొర్రూరు
మా కంపెనీ విత్తనాలు వాడితే అధిక దిగుబడి వస్తుందని చెప్పి తీరా పంటవేసాక దిగుబడి రాక నష్ట పోయిన రైతులు సదరు విత్తన కంపెనీ నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవా రం డివిజన్ కేంద్రంలో జిల్లా వినియోగదారుల స మాచార కేంద్రం ఇంచార్జ్ వింజమూరు సుధాకర్‌కు నరసింహుల పేట మండల కేంద్రానికి చెందిన బాధి త రైతులు భూక్యరాజు, భూక్య శంకర్లు లిఖితపూర్వ కంగా ఫిర్యాదు చేశారు.నాసిరకం వరివిత్తనాలు తమ కు అంటగట్టి మోసగించిన కంపెనీ నుంచి పరిహా రం అందించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేట మండల కేంద్రానికి చెందిన రైతు లు భూక్య రాజు, భూక్య శంకర్లు రబీలో వరి పండిం చేందుకై కొన్ని మాసాల క్రితం బేర్ కంపెనీకి చెందిన వరి విత్తనాలు కొనుగోలు చేశారు. ఎకరానికి 12 క్వింటాల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వ స్తుందని రైతులను కంపెనీ ప్రతినిధులు నమ్మించా రు. వారి మాటలు నమ్మిన ఇద్దరు రైతులు 5 ఎకరా ల్లో వరి నాటు వేశారు. సాగుకై 35 వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టారు.పంటచేతికివచ్చే సమ యంలో వారు చెప్పిన దిగుబడి కాకుండా ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు మాత్రమే దిగు బడి వచ్చింది. ఐదు ఎకరాలకు సుమారు 70 కింటా లు రావలసిన దిగుబడి 20 కింటాలు మాత్రమే వ చ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధిత రైతులు వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆ శ్రయించి ఫిర్యాదు చేశారు.మోసపూరిత ఆశ చూపి నకిలీ విత్తనాలు అంటగట్టిన కంపెనీపై చర్యలు తీసు కోవాలని, సాగు ఖర్చులు, పరిహారం కింద అందిం చాలని, తమను మోసగించిన బేర్ కంపెనీపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని నష్టపోయిన రూ. 4 లక్షల రూపాయల నష్టపరిహారం అందే విధంగా సహకరిం చాలని బాధిత రైతులు కోరారు. బేర్ కంపెనీకి నోటీ సులు పంపి నష్టపరిహారం అందేలా చర్యలు తీసు కుంటామని డిసిఐసి ఇన్చార్జి సుధాకర్ రైతులకు హా మీ ఇచ్చారు.రైతులను మోసగిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని, నాసిరకం విత్తనాలు అంటగడి తే వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుధా కర్ స్పష్టం చేశారు.