Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నినాదాలు
- పలువురు రాజకీయ నాయకులు సంతాపం
నవతెలంగాణ-నర్సంపేట
రంగాపురం గ్రామ జూనియర్ కార్యదర్శి బైరు సోని అంతక్రియలు పోలీసుల బందోబస్తు నడుమ సాగింది..శనివారం పట్టణంలోని పాకాల రోడ్డులోని సోని ఇంటి వద్ద ఆమె మృతదేహాన్ని జేపీఎస్‌లు, పలువురు రాజకీయ పార్టీల నాయకు లు సందర్శించి ద్రిగ్భాంతిని వ్యక్తం చేస్తూ మరణం పట్ల సంతాపం తెలిపారు. స మ్మెలో ఉన్న పలు ప్రాంతాల నుంచి జేపీఎస్‌లు చేరుకొన్నారు. ఏసీపీ సంపత్‌రావు నేతృత్వంలో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు చర్యలు చేపట్టారు. అం తక్రియల్లో జేపీఎస్‌ల నినాదాలు మారుమ్రోగాయి. డిమాండ్లను పరిష్కరిం చాలని జేపీఎస్‌లు సమ్మె చేస్తుండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహించడం వల్ల మనస్థాపానికి గురైన సోని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సోని కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
సోని మృతదేహాన్ని సందర్శించిన రేవూరి, దొంతి
జేపీఎస్ సోని మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నాయకులు ఎడ్ల అశోక్‌రెడ్డి తదితరులు సందర్శించా రు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే దొం తి మాధవరెడ్డి తదితర ఆ పార్టీ నాయకులు సోని మృత దేహాన్ని సందర్శించి నివా ళులర్పించారు. సోని మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తక్షణమే జేపీఎస్ ల డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలన్నారు. బీఎస్పీ నియో జకవర్గ ఇంచార్జి డ్యాగల శ్రీనివాస్, టీజేఎస్ కో-ఆర్డినేటర్ ఎస్కే.జావెద్, జనసేన పార్టీ నాయకులు మేరుగు శివకోటి తదితరులు అంతక్రియల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే జేపీఎస్‌లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఈ మర ణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సోని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.