Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శాయంపేట
వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల ప్రాంతంలో నిర్మిస్తున్న మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాంత వాసులకు శుద్ధమైన త్రాగునీరు అందించడానికి మిషన్ భగీరథ పైప్లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు శిఖంలో ఇంటెక్ వెల్ నిర్మాణం పనులు జరుగుతుండగా, అక్కడి నుండి టెక్స్టైల్ పార్క్ వరకు పైప్ లైన్ పనులను సంబంధిత కాంట్రాక్టర్ వేగవంతంగా చేపడుతుండడం ఆదివారం నవ తెలంగాణ క్లిక్ మనిపించింది.