Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయి..
- రాహుల్ జోడో యాత్ర ఫలితమే ఈ విజయం..
- భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ సంబరాల్లో
- గండ్ర సత్యనారాయణ రావు, అయిత ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం.., అది పేద ప్రజల విజయమని, కర్ణాటక ఫలితాలే రేపు డిసెంబర్ నెలలో తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు, డిసిసి ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్వేష పూరిత రాజకీయాలకు కర్ణాటక ప్రజలు చరమగీతం పాడారని తెలిపారు.రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర తో మార్పు మొదలైందని అన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సంబరాల్లో పీసీసీ సభ్యులు చల్లూరి మధు, ఐ ఎన్ టి యు సి కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి అజ్మీర జంపన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి భువనసుందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య, అంబాల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ నాయకులు బేతల్లి మధుకర్ రెడ్డి, పొన్నగంటి శ్రీనివాస్, బౌతు రాజేష్, కాగితోజు రమణాచారి, పిప్పాల రాజేందర్, అర్జున్, మహేందర్, రజినీకాంత్ గౌడ్, రంజిత్, హఫీజ్, వెంకీ యాదవ్, సతీష్, నాను తదితరులు ఉన్నారు.
బీజేపీకి గట్టి బుద్ధి చెప్పిన కర్ణాటక ప్రజలు
మంథని ఎమ్మెల్యే శ్రీదర్ బాబు
మల్హర్రావు : కులాలు, మతాల పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీకి కర్ణాటక ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని జాతీయ కాంగ్రేస్ కార్యదర్శి,మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు శనివారం ఒక ప్రకటన పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సంద ఎమ్మెల్యే మాట్లాడారు.ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని మోడీకి కర్ణాటక ప్రజలు చురకలు అంటించారనన్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడి దారులకు అప్పనంగా అమ్మేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మోడీకి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాబోయేది గడ్డుకాలమేనన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు.ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారన్నారు.మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్‌కు ఇక పాలించే అర్హత లేదన్నారు.పేపర్ లీకేజీలతో లక్షలాదిమంది విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ సభలో చేసి రైతు డిక్లరేషన్, హైదరాబాద్ సరూర్‌నగర్ సభలో చేసిన యూత్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు.
మహదేవపూర్ : మహాదేవపూర్ మండల కేంద్రంలోమాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం వద్దశనివారం సాయంత్రంకాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారుకర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీఅఖండ మెజార్టీ రావడంతో ముఖ్యంగాఏఐసిసి కార్యదర్శి మంథని ఎమ్మెల్యేదుదిల్ల శ్రీధర్ బాబు ఇన్చార్జి ఉన్నరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీభారీ మెజార్టీ రావడంతోమహాదేవపూర్ కాంగ్రెస్ నాయకులుసంబరాలు జరుపుకున్నారుఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటరాజబాబుమండల అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్ యూత్ మండల అధ్యక్షులు అశోక్ఎంపిటిసి ఆకుతోటకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు
కాటారం : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా శనివారం కాటారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కూడలిలో సంబరాలు నిర్వహించారు . టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం చేపడుతుందన్న విషయాన్ని కర్ణాటక ఫలితాలు నీ దర్శనం అన్నారు. రాష్ట్ర దేశ రాజకీయాల్లో అధికార పార్టీలు దురంకాహార పాలనకు ప్రజలు చమర గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబుకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. రెండు నెలల కాల వ్యవధిలో పూర్తిస్థాయిలో కర్ణాటకలో గత ప్రభుత్వాలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ స్థానిక రాష్ట్ర నాయకులను సమన్వయ పరుస్తూ నీతి నిజాయితీ గల అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి పార్టీ కోసం ఎనలేని కషిచేసిన శ్రీధర్ బాబుకి ఈ ప్రాంత ప్రజల తరపున కతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతద్యం అని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఆంగోత్ సుగుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్నా రమేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చీమల సందీప్, మహిళ మండల అధ్యక్షులు ఎంపిటిసి జాడి మహేశ్వరి రమేష్, సర్పంచ్ లు జంగిలి నరేష్, కోడి రవికుమార్, అంగజాల అశోక్ కుమార్, చీమల రాజు, కొట్టే ప్రభాకర్ పాల్గొన్నారు.