Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
జిల్లాలో భూగర్భ జలాల పెంపుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని, ఈ నెల 17న నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అధికారులను ఆదేశించారు. ఆది వారం కలెక్టరేట్లోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల లో కేంద్ర జలశక్తి మిషన్ సభ్యుల పర్యటన ఉన్నందున జిల్లాలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యల గురించి వారికి వివరించాలని తెలిపారు. వాటర్ మేనే జ్మెంట్ సిస్టం ద్వారా నిర్వహించే కార్యక్రమాలు, చెక్ డ్యామ్లు, చెరువుల, కుంటల మరమ్మత్తుల వివరాలు వ్యవసాయ శాఖ, అటవీశాఖ, ఆర్టికల్చర్, ఇరిగేషన్, భూగ ర్భ జలవనరుల శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జలవనరుల సంరక్షణ, భూగర్భ జిల్లాల పెంపు ఆవశ్యకతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాల గురించి ప్రజలకు ఎలా అమలు అందుకున్న సౌకర్యాలపై వారికి తెలియ జేయాలని ఆయన కోరారు. ఈనెల 17న ఉదయం 11 నుండి 1.30 వరకు నిర్వ హించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఒక్కో సెంటర్కు ఒక ప్రత్యేక అధికారి నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, జిల్లా వ్యాప్తం గా 1698 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు, ప్రభుత్వ సూచన ల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావే శంలో డిఆర్డిఏ పిడి రాంరెడ్డి, ఆర్డీవో మనసూరి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వినోద్ కుమార్, పాలిసెట్ కో-ఆర్డినేటర్ నరసయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి లత, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.