Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ టేకుమట్ల
మండలంలోని కుందనపల్లి గ్రామంలో జరుగుతున్న మాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ట మహౌత్సవంలో ఆదివారం టిపిసిసి సభ్యుడు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావుకు గ్రామ ప్రజలు, బొడ్రాయి కార్యక్రమానిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి అమ్మవార్ల అను గ్రహంతో గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో తప్పని సరిగా మహాలక్ష్మి భూలక్ష్మి తప్పనిసరిగా ప్రతిష్టాపించుకోవాలని అన్నారు. మనమందరం సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ ప్రజలందరూ కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజాల రవి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పొన్నం సాంబయ్య,దాసారపు సదానందం, మాడుగుల వీరేశం, టైగర్ రమణ, పొన్నం తిరుపతి,ఆరేపల్లి తిరుపతి, పురుషోత్తం, శంకర్, సాంబమూర్తి,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.