Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు
నవతెలంగాణ-ఆత్మకూర్
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగింది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఏడాది చివర్లో జరిగే సార్వ త్రిక ఎన్నికల్లో కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందని ఆ పార్టీ వర్గాల్లో ధీమా వ్యక్తం అవుతుంది. కర్ణా టకలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పురస్కరించు కొని ఆ పార్టీ శ్రేణులు ఉప్పొంగిన ఉత్సాహంతో నిర్వహించిన విజయోత్సవ సంబరాలు అంబ రాన్నంటాయి. గ్రామ గ్రామాన పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ జెండాను చేతపట్టి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ విజయో త్సవ ర్యాలీలు నిర్వహించారు.చౌళ్లపల్లి గ్రామం లో విజయోత్సవం సందర్భంగా సర్పంచ్ కంచ రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కషి ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిందని, సోనియమ్మ ఇచ్చిన రాష్ట్రాన్ని కేసిఆర్ వల్ల కాటిగా మార్చారని తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాగయ్యపల్లి గ్రామంలో అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు గుండాల క్రాంతి, గ్రామ అధ్యక్షుడు నేరెళ్ల రమణారెడ్డి మాట్లాడు తూ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటి దని కాంగ్రెస్ పార్టీ హయంలో ఇందిరమ్మ ఇళ్లు,ఆరోగ్య శ్రీ,ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు కల్పించిందని అన్నారు. అక్కపేట గ్రామంలో పార్టీ అధ్యక్షులు ముద్దం కష్ణ, మాజీ వైస్ ఎంపీపీ ముద్దం సాంబయ్య, వార్డు సభ్యులు,పెద్దబోయిన రవి,రాంబాబు నాయకులతో, అగ్రంపహాడ్ గ్రామంలో మండల నాయకులు బోరిగం స్వామి,గ్రామ అధ్యక్షులు మాదాసి ఏలియా, యువకులు,లింగమడుగుపల్లి గ్రామంలో అధ్యక్షులు ప్రసాద్,గ్రామస్తులతొ కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చే సుకున్నారు.గూడెప్పాడ్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిరం రజనీకర్ రెడ్డి,ఉప సర్పంచ్ వీసం శ్రీనివాస్ రెడ్డి,పెంచికలపేట గ్రామంలో లింగయ్య, మండల నాయకులు ప్రసాద్, నీరుకుళ్ళ గ్రామంలో అధ్యక్షులు కిన్నెర చందు గ్రామ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెలంగాణలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు. వార్డు సభ్యులు సిలువేరు ప్రసంగి,బిక్షపతి, నరేష, పవన్, రఘు నాగరాజు, అనిల్ పాల్గొన్నారు.