Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి భవన్ ముట్టడిస్తాం
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-బయ్యారం
గత 28 రోజులుగా తీవ్రమైన ఎండల్లో నిరవధిక సమ్మె చేస్తున్న ఐకెపి వీవో ఏల పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేనియెడల ప్రగతి భవన్ ముట్టడిస్తా మని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో ఐకెపి వీవోఏల సమ్మె శిబిరాన్ని ఆయన సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తూ మహిళలను ఆర్థి కంగా చైతన్య పరుస్తున్న వీవోఎలపేదరికం పోగొట్టే చర్యలు తీసుకోవడంలో ప్రభు త్వం, సెర్ఫ్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మె విచ్చిన్నానికి కొందరు పాల్పడుతున్నారని సమ్మె విరమించామని గొప్పలు చెప్పుకునే వారు సమ్మె విరమించి ఏమి సాధించారో బహిరంగంగా తెలియపరచాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం నియమిం చిన నిపుణుల కమిటీని కనీస వేతనం 26 వేలు ఉండాలని, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన పీఆర్సీలో కనీస వేతనం 19వేలుగా ప్రకటించిందని వివ రించారు. కార్మికులకు నష్టం చేసే చర్యలను సీఐటీయూ ఎట్టి పరిస్థితుల్లోనూ స హించదన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించాబడుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్లను పరిష్కరించాలని లేని యెడల సమ్మె ఉధృతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని, కలెక్టరేట్ల ముట్టడికి, ఛలో హైదరాబాద్, ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, ఐకేపీ వీవోఎ యూనియన్ జిల్లా కన్వీనర్ చింతా మౌనిక, సీఐటీయూ మండల కన్వీనర్ వల్లాల వెంకన్న, విఓఏ యూనియన్ మండల అధ్యక్షురాలు ఆకుల వసం త, నాయకులు శ్రీనివాస్, లలిత, సుజాత, శ్రీదేవి, మహేశ్వరి, ఆరిఫా, భారతి, ఉపేంద్ర, నరేష్, సునీత, మంజుల, పద్మ, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.