Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ కార్యదర్శుల సంఘం డిమాండ్
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ఇప్పటికే పలువురు ఉద్యోగులు మరణించారని, తాజాగా నర్సంపేటకు చెంది న సోని అనే జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నదని, వీరం దరి చావులకు మంత్రి దయాకర్ రావుతో పాటు ప్రభుత్వం బాధ్యత వహించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. జూ నియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు శుక్రవారం బీఎస్పీ జిల్లా ఇంచార్జ్ నిర్మాల రత్నం, జనగామ నియోజకవర్గ ఇన్చార్జి జేరిపోతుల కుమార్ తదితరులు సంఘీభావం తెలిపి మద్ద తు పలికారు. 15 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఉద్యోగుల పట్ల అవ హేళన మాట్లాడుతూ మీరు కాంట్రాక్టు ఉద్యోగులని, మీరు రెగ్యులర్ కావడానికి ఏడ నుంచి పది సంవత్సరాలైనా పట్టవచ్చు అని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధం గా కామెంట్స్ చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పంచా యతీ కార్యదర్శులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.