Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
ఆదివాసీల అస్తిత్వ రక్ష ణకై పర్యావరణ జీవ వరణా ల పరిరక్షణకై ఈ నెల 21న విశాఖపట్నంలో జరుగు ఆది వాసీల అంతర్జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మండలంలోని వెంకట్రాంపురం, బాలాజీపేట, గౌరారం, కొత్తపేట గ్రామాలలో పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఆదివాసీల జిల్లా నాయకుడు చింతా వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆదివాసీ వ్యతిరేక విధానాల ఫలితంగా ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని బహుళజాతి సంస్థలకు ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న సమస్త సంపదను కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని దీనిలో భాగంగానే 2022 అటవీ సంరక్షణ నియమాల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి దీనిద్వారా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని, తమ ప్రాంతాలలో నే తమను పరాయి వారీగా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తు న్నాయని, దీనిలో భాగంగానే నేటికీ ఆదివాసీలు సేద్యం చేసుకుంటున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని,అందులో భాగంగానే లక్షలాది ఆదివాసీ కుటుంబాలను వారి ప్రాంతాల నుండి వెళ్ళగొట్టడానికి ఈ పాల కవర్గాలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వివిధ పద్ధతిలో ఆదివాసీల పై అనే క రకాల వేధింపులు కొనసాగిస్తున్నారని, ఆదివాసీలు తమ హక్కులను కాపాడుకో వడానికి ఐక్యంగా సంఘటితంగా పోరాడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని, దీనిలో భాగంగానే విశాఖపట్నంలో జాతీయస్థాయిసదస్సును నిర్వహించడం జరు గుతుందని, ఈ సదస్సుకు ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పడిగ సురేష్, తోటకూరి రామకృష్ణ, పోతిని రాములు, ఏరిన వెంకటమ్మ పద్మ, కుసిని వెంకన్న , ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.