Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే డాక్టర్ ధనసరి సీతక్క
నవతెలంగాణ-గూడూరు
వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ దానసరి సీతక్క అన్నారు. ఆదివారం గూడూరు మండల పరిధిలో భాగంగా వీవో ఏలు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపా రు. ఈ సందర్భంగా పలు డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రాన్ని సీతక్కకు వీవో ఏలు అందజేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 28 రోజులుగా దీక్ష చేప డుతున్న కనీసం ప్రభుత్వం చలించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమ స్యలు పరిష్కరించే దిశగా తమ వంతు కృషి చేస్తానని మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే సానుకూలమైన డిమాండ్లన్నీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శిబిరాన్ని సందర్శించిన వారిలో మైనార్టీరాష్ట్ర నాయకులు ఎస్కే యాకూ బ్ పాషా, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధా, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూనవతు రమేష్, మండల పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి, సొసైటీ వైస్ చైర్మన్ వేం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ యూత్ అధ్యక్షుడు బుడిగే సతీష్, వివోఎల యూనియన్ అధ్యక్షురాలు దారం శ్రీలత, కార్యదర్శి నాన్నబాల పురుషో త్తం, శారద, వసంత, రాజు, పద్మ, సుగుణ, బాలు పాల్గొన్నారు.