Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలో సర్పంచ్ శ్రీపతిబాపు స్వీయ పర్యవేక్షణలో ''పరిశుభ్రతపై ప్రజా పరివర్తన'' కోరుతూ చేపడుతున్న పరిసరాల శుభ్రం కార్యక్రమం శనివారంతొమ్మిదో రోజుకు చేరింది.పోత వాడ జేగారి మధునమ్మ ఇంటి నుండి గొల్ల పెద్దన్న ఇంటివరకు పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది.పరిశుభ్రత యే మా ప్రధమ కర్తవ్యంగా పారిశుధ్యంలో గ్రామాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నా మని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు. ఇంటిలోని వ్యర్ధాలను చెత్త బుట్టలోనే వేస్తా మని గ్రామ ప్రజలుగా మాట ఇవ్వాలని అన్నారు. డ్రైనేజీలో, రోడ్డుపై చెత్త వేయడం నేరమని పర్యావరణానికి హాని చేయద్దని,పరిసరాల శుభ్రత పాటించ డం మనందరి బాధ్యత కావాలని అన్నారు. మహాదేవపూర్ ను స్వచ్ఛ గ్రామం చే యాలన్న మా ఆశ,ప్రజల ఆశయం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సఫా యి కార్మికులు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.