Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఏమ్మెళ్యే బండి పుల్లయ్య
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
ఈ నెల 16 తేదిన వరంగల్ ములుగు రోడ్ దగ్గర్లో సునీల్ గార్డెన్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి తెలుగు వారి ఆత్మగౌరవ సభ (మినీ మహానాడు)ను పార్లమెంట్ లోని నాయకులు, కార్యకర్తలు స్వత హాగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్రస్థాయి వరంగల్ పార్లమెంట్ పరిశీలకులు బండి పుల్లయ్య పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ నగరంలో ఓ ప్రయివేటు హౌటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయ కులు సంయుక్తంగా మాట్లాడుతూ వెండితెర ఇలవేల్పు, ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని దేశానికి చాటి చెప్పున మహనీయుడు అని అన్నారు. తెలంగాణాలో పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని పటేల్ పట్వారీ వ్యవస్థ ను రూపు మాపి బడుగుబలహీన వర్గాల ను చైతన్యపరిచి రాజ్యాధికారం కట్టబెట్టారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివద్ధి పథంలో నడిపిన నాయకుడు అని అన్నారు. తెలంగాణాకు,హైద్రాబాద్ కు ఆయన చేసిన అభివద్ధి ని ఎవ్వరూ కాదనలేదని సత్యం అని తెలిపారు. సైబరాబాద్ సిటీ ని తయారు చేసిన నాయకులు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యండి.రహీం మాట్లాడతు తెలంగాణ ప్రజల గుండెల్లో తెలుగుదేశం ఉందని తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుందని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ బిజెపి లు విస్మరించి ప్రజలను మోసం చేశాయన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి బాబా ఖాదర్ అలీ వరంగల్ పార్లమెంట్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యం.డి రహీమ్, వర్ధన్నపేట కో ఆర్డినేటర్ చాడా మరియ, రాష్ట్ర నాయకులు గట్టు ప్రసాద్ బాబు, ఆర్శనపల్లి విద్యాసాగర్ రావు, నాగవెళ్ళి సురేష్, జి యల్, శ్రీధర్, చిలువెరు రవీందర్, చంద్రబాబు యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు చేన్నోజు రఘుబాబు, నాయకులు హరిధాస్యం సురేష్, కొంగర ప్రభాకర్, బతిని ఎల్లయ్య గౌడ్, పిట్టల శ్రీనివాస్ తదితరులున్నారు.