Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మె జార్టీతో గెలుపొందిన కారణంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో నెహ్రు పార్క్ నుండి బస్టాండ్ వరకు టపాసులు పే లుస్తూ సీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మా జీ ఎమ్మెల్యే, టీపీసీసీ సభ్యులు ప్రతాపరెడ్డి నేతృత్వంలో జరి గిన ఈ కార్యక్రమంలో చిటాకోడూరు పిఎసిసి డైరెక్టర్ వం గాల మల్లారెడ్డి, జిల్లాల సిద్ధారెడ్డి, గంగం నరసింహారెడ్డి, ప ట్టణ కిసాన్ అధ్యక్షులు మోడ్డ శ్రీనివాస్, సీనియర్ నాయకు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువు కాంగ్రెస్ నాయకు లు మాట్లాడుతూ కర్ణాటక మాత్రమే పరిమితం గెలుపు కా దని రాజకీయాల్లో పెనుమార్పులకు గెలుస్తుందని సింగిల్ విండో మాజీ చైర్మన్ జిల్లాల సిద్ధారెడ్డి చిన్నకోడూరు పిఎసి ఎస్ డైరెక్టర్ రంగాల మల్లారెడి,్డ సంఘం నరసింహారెడ్డి, మో టి శ్రీనివాస్, లింగాల నర్సిరెడ్డి, బుట్టా నర్సింగరావు తదితరు లు మాట్లాడారు. కర్ణాటక గెలుపుతో దేశంలోనే పెను మా ర్పులు వస్తాయని దేశంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ముస్తాల చందర్, పిట్టల సతీష్, ఆకుల లక్ష్మయ్య, మల్లేష్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్ తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మేండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో 136 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి మండల కాంగ్రెస్ నాయకులంద రూ సంబరాలు చేసుకోవడం జరిగింది.ఈసందర్భంగా మం డల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి మహేందర్‌రెడ్డి మాట్లాడు తూ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిపిం చిన ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గతంలో ప్రియ తమ నాయకులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహు ల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర ఫలితమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాహుల్ గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేష న్, ప్రియాంక గాంధీ సరూర్‌నగర్‌లో నిరుద్యోగ భరోసా సభ ఈ విధంగా అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ రా ష్ట్రంలో పేద ప్రజల వెన్నంటి ఉండడం రాబోయే కాలంలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న, సింగి ల్ విండో వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు సత్యానందం, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బా లు నాయక్, బ్లాక్.కాంగ్రెస్ నాయకులు అయ్యూబ్, ఖాన్, కూరెల్లి సతీష్, ఎల్లగౌడ్, సబ్‌స్టేషన్ సర్పంచ్ గుగులోతు వెం కన్న, దనసరి ఉపసర్పంచ్ చిన్న వెంకన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లం గణేష్, షేక్ ముజ్జు,గొల్లపల్లి మహేందర్, పరంకుశం శ్రీహరి, తోట సుధాకర్, గండి శ్రీనివాస్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి, గండి శ్రీనివాస్, గంట బాలకష్ణారెడ్డి, ఎండి తాజుద్దీన్,మాసాడి శ్రీనివాస్, కీర్తి సు రేందర్, గంట బాలకృష్ణారెడ్డి, భూక్య మల్సూర్, చందు, లిం గాల నేతాజీ, జాటోత్ రమేష్, గుగులోత్, రాము, గుండు గోపాల్, నూకల వెంకటేశ్వర్లు, అయిత సారయ్య, రాజులపా టి మల్లయ్య, గాదె శ్రీనివాస్ పాల్గొన్నారు.
తొర్రూరు : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం చారి త్రాత్మకమని కాంగ్రెస్ తొర్రూరు మండల, పట్టణ అధ్యక్షులు చెవిటి సధాకర్, సోమ రాజశేఖర్‌లు అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చి న సందర్భంగా డివిజన్ కేంద్రంలోని స్థానిక గాంధీ సెంటర్ లో శనివారం బాణా సంచనాలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా వారు మా ట్లాడారు. కర్ణాటకలో బిజెపికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని, తెలంగాణలో కేసీఆర్‌కు ఇదే గతి పడుతుందన్నారు. కేంద్రం లోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. బీజేపీకి కర్ణాటక ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీ మా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వా నికి షాక్ ఇచ్చేందుకు ప్రజలుసిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌ డ్, ఓబీసీ మండలాధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్, తునం శ్రవణ్ కుమార్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు దేవేందర్ నాయక్, నాయకులు బిజ్జాల వరప్రసాద్, బోలగాని శ్రీనివాస్ గౌడ్. మొగుళ్ల లింగన్నగౌడ్, రాంపల్లి రవి,గిరి, మాచర్ల అరవింద్, నల్లమాస వీరబాబు, సురేందర్,రాజ్ కుమార్,అన్వేష్ గౌడ్, చింటూ, గణేష్, మురళి, సాగర్, మహేష్, మేకల రామ్మూర్తి, శ్రీకాంత్, సాయి, ఫరూక్ పాల్గొన్నారు.
ములుగు : కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భంగా ములుగు పట్టణంలో టపాసులు కాల్చి కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క సంబరాలు జ రుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం సంతోషదాయ కం అని నియంతత్వ పోకడలతో దేశాన్ని పాలిస్తున్న బిజెపి ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. కులాల మధ్య మతాల మ ధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పభం గడుపుతున్న బిజెపికి కర్ణాటక తీర్పు గుణపాఠం అని, కాంగ్రెస్ అంటేనే పేదల ప క్షాన నిలబడి కొట్లడే పార్టీ అని కర్ణాటక గెలుపు రాబోయే రోజుల్లో తెలంగాణలో పునరావృతం అవుతుందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కేకే కట్ చేసి కర్ణాటక ప్రజలకు ఎమ్మెల్యే సీతక్క శుభాకాంక్ష లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడా కుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, నల్లేల భరత్ కుమార్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,వైస్ చైర్మన్ మర్రి రాజు, పట్టణ అధ్యక్షులు వంగ రవి, యాదవ్, చింతనిప్పుల భిక్షపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టేవాడ తిరుపతి, మైనార్టీ సెల్ మండల అధ్య క్షులు షకీల్, ఎంపీటీసీ మవురపు తిరుపతిరెడ్డి, ఎన్ఎస్యూ ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, సర్పంచ్ ఎండీ అహ్మ ద్ పాషా,మాజీ సహకార సంఘం చైర్మన్ కునురు అశోక్ గౌడ్,మాజీ సర్పంచ్ మూసినపెల్లి కుమార్‌గౌడ్,మండల ఉపాధ్యక్షులు ఆర్షమ్ రఘు, కోంగరి నరేందర్,కిసాన్ కాం గ్రెస్ జిల్లా కార్యదర్శి శంకరయ్య, యాసం రవి, కుమార్, గ్రా మ కమిటీ అధ్యక్షులు రాజన్న, బొడ రఘు, సతీష్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, మాజీ సర్పంచ్ జన్ను రవి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీకృష్ణ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్‌సింగ్, సహకార సంఘం డైరెక్టర్లు భాగ్య, రమేష్, బొయిని రాజు, బొడ సతీష్, ఓడ రాజు, యూ త్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు వసంత శ్రీనివాస్,వర్కింగ్ క మిటీ అధ్యక్షులు గద్దల నవీన్, పట్టణఅధ్యక్షులు లక్కీ,ఎస్టీ సె ల్ మండల అధ్యక్షులు చెల వినరు, హజి, జాఫర్, కుతుబు ద్దిన్,చంద్,శ్రీధర్,అనీల్,సాంబయ్య,రవీందర్ పాల్గొన్నారు.
బచ్చన్నపేట: కర్ణాటక ప్రజలలాగానే తెలంగాణ ప్రజల మనసు మారుతుందని స్టేట్‌కాంగ్రెస్ కోఆర్డినేటర్ నిడిగొం డ శ్రీనివాస్ అన్నారు. శనివారం కర్ణాటకలో కాంగ్రెస్ అఖం డ విజయంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెం కట్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అల్వల ఎల్లయ్య, పొచ్చ న్నపేట సర్పంచ్ గట్టు మంజుల మల్లేష్‌ల ఆధ్వ ్యంలో బచ్చన్నపేటలో సంబురాలు చేసుకున్నారు.ముఖ్య అతిదులు గా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇది కర్ణాటక ప్రజల విజ యం అని ఇక నుండి బీజేపీ ఆటలు సాగవు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ దేనని అన్నారు. ఎలాగైతే కర్ణాటక అవినీ తిని ఇంటి ఇంటికి తీసుకుపోయారో తెలంగాణలో కూడా లక్ష కోట్ల అవి నీతిని ఇంటి ఇంటికి చేరే విధంగా చెప్పి అవి నీతి ప్రభుత్వం ని పారదోలుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి జంగిలి స్వామి, కోశాధికారి దేవరకొండ రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు, ఎస్సీసెల్ అధ్య క్షుడు నల్ల మహేందర్, టౌన్ ఉపాద్యాక్షులు దాచేపల్లి రాజయ్య కార్యద ర్శిలు అవధూత శ్రీనివాస్, అరుకల శ్రీనివాస్, కొయ్యడా శ్రీని వాస్, మండల ఉపాధ్యక్షులు గార్లపాటి మహిపాల్‌రెడ్డి, రా జేష్ కన్నా, సోషల్ మీడియా కన్వీనర్ కవ్వం రాజీ రెడ్డి కన్నా, ఈదుల కంటి వెంకట్ రెడ్డి, బొమ్మేన రాజయ్య, చిక్కుడు మ ల్లేష్, నీల మల్లేష్, బోడ బట్ల ఐలయ్య, బండారు మల్లయ్య, చిలుక ప్రవీణ్, అంజి గౌడ్, కొరకుల రవి, వడ్డేపల్లి వెంకట్ రెడ్డి, బాల్ రెడ్డి, గొర్ల అబ్బులు పాల్గొన్నారు.
గూడూరు : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టి బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నునావత్ రమేష్ నాయక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి స్వామి, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు ఎండి యాకూబ్‌పాషా,మండల సీనియర్ నాయ కులు బుడిగెసతీష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చంటిస్వామి, పడమటితండా సర్పంచ్ హుస్సేని బాలు నా యక్, రాములు తండా సర్పంచ్, సుగుణ లక్ష్మణ్ నాయక్, బ్రాహ్మణపల్లి సర్పంచ్, పూనం యాకయ్య, గూడూరు ఉపస ర్పంచ్ శివరాత్రి సంపత్, గూడూరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎండి రసూల్, సిటీ యూత్ అధ్యక్షులు మండల మల్లేష్, గా జుల గట్టు ఉపసర్పంచ్ ఎలికట్ట వెంకన్న, గూడూరు గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ఎలమందల శ్రీనివాస్, గూడూరు వార్డ్ మెంబర్లు రాసమల్ల యాకయ్య, వాంకుడోత్ కొమ్మలు గోప గాని యాదగిరి, మండల సుధాకర్ పాల్గొన్నారు.
బయ్యారం : కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రాత్మక ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రంలో కాం గ్రెస్ సత్తుపల్లి కోఆర్డినేటర్, మాజీ మండల అధ్యక్షులు వడ్ల మూడి సురేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు కోత్తపేటలో ర్యాలీనిర్వహించి, బాణా సం చాకాల్చి, కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లా డుతూ ఈ విజయం ముమ్మాటికి రాహుల్ గాంధీ భార త్ జోడో పాదయాత్ర వల్లే సిద్ధించిందని ఆయన తెలిపారు. ఘనవిజయానికి పాటుపడిన కెపిసిసి చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక సిఎల్పి నేత సిద్ధ రామయ్యకు కృతజ్ఞతలు తెలిపా రు. ఇదే విధంగా తెలంగాణలో కూడా అవినీతి పరిపాలన సాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ఎఐసిసి, టిపిసిసి ప్రకటించిన రైతు, నిరుద్యోగ డిక్లరేషన్‌ను, రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని గడప గడ పకు చేర వేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసి డెంట్ గోగినేని సీతారామ య్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగావతి రవి, తీగల వెంకట య్య, గ్రామ కార్యదర్శి రామ్మూర్తి, వీసం భద్రయ్య, లక్ష్మ, జార సాగర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర : రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖా యమని ఆపార్టీ మండలాధ్యక్షుడు ముద్దసాని సురేష్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అఖండ మెజార్టీ సాధించడంతో పార్టీ శ్రేణులు శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోసంబరాలు జరు పుకున్నారు. బాణా సంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నా రు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీను, మండల ఉపా ధ్యక్షుడు రంగు మురళి, దుంపల కుమారస్వామి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్,ఎస్టీసెల్ మండల అధ్య క్షుడు సీతారాం నాయక్, యూత్ పట్టణ అధ్యక్షుడు అనపు రం వినోద్, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్, ఎన్ఎస్యూఐ అధ్య క్షుడు సంపత్, చెరుకు సత్యం, వేణు, ఓరుగంటి సతీష్, రవి, రమేష్, చిరంజీవి, లచ్చిరాం, రమేష్, రామ్ చరణ్, ధర్మారపు వెంకన్న, ఆవుల మ హేష్, అబ్దుల్లా పాల్గొన్నారు.
పాలకుర్తి : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం దేశానికే మలుపుగా మారిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. కర్ణాటక ఎన్ని కల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో శని వారం పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణులు రెండుగ్రూపులుగా విడి పోయి వేర్వేరుగా ర్యాలీ నిర్వహించి, టపాకాయలు పేలుస్తూ స్వీట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారని అన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కతిక విభాగం అధ్యక్షులు చక్రాల రఘు,రాష్ట్ర సేవాదళ్ ఆర్గనైజర్ గుగ్గిళ్ల ఆదినారాయణ, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్య క్షులు జలగం కుమార్,జిల్లా కార్యదర్శి కారుపోతుల శ్రీనివా స్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాదాస్ హరీష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బైకానీ ఐలేష్, ఎస్సీ సేల్ మం డల అధ్యక్షులు గాదేపాక భాస్కర్, ఎస్టిసెల్ మండల అధ్యక్షు లు లావుడ్యా భాస్కర్ నాయక్, ముత్తారం ఎంపీటీసీ బొమ్మ గాని మానస భాస్కర్, బమ్మెర సర్పంచ్ జలగం నాగభూష ణం,మండల నాయకులు నీరటి చంద్రయ్య,బైరు భార్గవ్, గంగు కష్ణమూర్తి, కూస భాస్కర్ రెడ్డి, గోనే దామోదర్ రెడ్డి, పులి గణేష్, గడ్డం యాక సోమయ్య, సంగీ వెంకన్న, గాదే గాని సోమయ్య, నారగాని ఎల్లయ్య యువజన నాయకులు గోనె మహేందర్ రెడ్డి, బత్తిని అశోక్, గణేష్, సోమ శ్రీకాంత్, అనిల్ రమేష్, సురేష్, ప్రభాకర్, తిరుపతి, హాతీరామ్, యా కు, రాజు, ఉపేందర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.
గార్ల : కేంద్రంలో బిజెపి అరాచక పాలనకు చరమగీ తం పాడేందుకు దేశ ప్రజలు సిద్దంగా ఉన్నారనడానికి అందుకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఒక ఉదాహరణ అనిముల్కనూరు ఎంపిటీసి మాళోత్ వెంకట్ లాల్ అన్నారు. కర్ణాకటలో ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును స్వాగతిస్తూ శనివారం స్దానిక నెహ్రూ సెం టర్లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో టపాసులు కాల్చుతూ గెలుపు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీని ప్రజలు తిరస్కరించడం అభినందనీయయన్నారు. కర్ణాటక నుండి ప్రారంభమైన బిజె పి వ్యతిరేక ఓటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో పునవృతం అయ్యి బిజెపిని ఓడించడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నార న్నారు. తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీ సుక వచ్చేందుకు సైనికుల్లా పని చేస్తామని, కాంగ్రెస్‌కు ప ట్టం కట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు టి.కృష్ణ, పి.రామారావు,షంషాద్ బేగం, వినోద, సుందర్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలు పొందడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షవర్ధన్, ఏఐసిసి ఆల్ ఇండియా ఆదివాసి వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నా యక్ నాయక్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధ హర్ష వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంట ర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు పంచు కొని శనివారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కు ప్రజలు ఆకర్షితులై ప్రజలు పట్టం కట్టారన్నారు. తెలంగా ణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వం నిలబెట్టబోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షులు న్యాయని సత్యబాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి హెచ్,వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ,్ పిఎసిఎస్ డైరెక్టర్ బాలాజీనాయక్, కాసం లక్ష్మారెడ్డి, గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, తుళ్ల ప్రణరు కుమార్, సలగు పూర్ణ చందర్, వరిపల్లి పూర్ణచందర్, పెరుమాండ్ల మల్లేశం, చిన్నబోయిన శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూ డా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని టిటిసి కార్య దర్శి పైడాకుల అశోక్ అన్నారు.శనివారం గోవిందరావుపేట మండల కేంద్రం, పస్రా గ్రామాల్లో మండల వర్కింగ్ ప్రెసి డెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో కర్ణాటక రా ష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ మండల నాయకుల సమక్షంలో బాలసంచా పేల్చి సంబరాలు జరుప ుకున్నారు. అశోక్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ప్రజల గెలుపు అని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పునరావృతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్య క్షులు పెండెం శ్రీకాంత్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మహిళ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగ పార్వతి, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, జెట్టి సోమయ్య, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, పాశం మాధవరెడ్డి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, బీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన రవి, పడిదల సాంబయ్య, మద్దాలి నాగమణి, చింత క్రాంతి, సర్పంచులు ముద్దబోయిన రవి,గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్రావు, బద్దం లింగారెడ్డి, వేల్పుగొండ ప్రకాష్,జంపాల చంద్రశేఖర్, పాలెం యాదగిరి, మిరియాల యాదగిరి రెడ్డి, కొల్లు శ్రీనివాస్ రెడ్డి, మేడ సైది రెడ్డి, , చేరుకుల సురేష్, జక్కు రణదీప్, గాంధర్ల వేణు, తండారవి, తండాకృష్ణ, చింతపండు లక్ష్మీ నారాయణ, సామ సమ్మిరెడ్డి, సామ వెంకట్ రెడ్డి, సూదిరెడ్డి జయమ్మ, పులుసం లక్ష్మీ, చొప్పదండి వసంత, రమ పాల్గొన్నారు.
తాడ్వాయి : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు పై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ల ఆ ధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీ ని ర్వహించి సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చు తూ మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కర్ణాటక ఎన్నికల ఫలితాలలో రాహుల్ సునామి మొదలైందని, వారి నాయకత్వంలో కేంద్రంలో కాం గ్రెస్ అధికారంలోకి రాబోతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ సునామీలో మోడీ మానియా కొట్టుకుపో యిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అన్నది ఒక సంకేతమని, దీంతో ఇకనుంచి దేశంలో జరగబోయే ఎన్ని కల్లో ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇంత స్పష్టమైన మెజారిటీ ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు వా రు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా కర్ణాటక ఎన్ని కల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన అన్ని రా ష్ట్రాల కాంగ్రెస్ నాయకుల శ్రేణులకు పేరుపేరునా వారు కృ తజ్ఞతలు తెలిపారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్ని కల్లో రాహుల్ గాంధీ నాయకత్వాల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావా న్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండ లాధ్యక్షులు అనంతరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రె సిడెంట్ పోలేబోయిన సజన, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు రేగ కళ్యాణి, సర్పంచ్ సునీల్ దొర, మాజీ సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.