Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ నిబంధనలతో రైతులకు ఇక్కట్లు
- ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు
- ఆన్లైన్లో నమోదు అయితేనే టోకెన్ల పంపిణీ
- కొనుగోలు కేంద్రం వద్ద పేరుకుపోతున్న మక్కల బస్తాలు
- ప్రారంభించని తూకాలు
నవతెలంగాణ - శాయంపేట
రైతులు ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పంటలు సాగు చేయగా, పండించిన పంటను విక్రయించడం మరొక ఎత్తు అవుతుంది. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంట క్వింటాల్‌కు రూ. 1962 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకట నలు చేస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం మక్కల కొనుగోలు నియమ నిబం ధనల పేరుతో నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో పంట విక్ర యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శాయంపేట మండల పరిధి గ్రామాలలో యాసంగి సీజన్లో మొక్కజొన్న 5,704 ఎకరాల విస్తీర్ణం సాగు అయ్యింది. ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలతో 1550 ఎకరాలు పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి గుర్తిం చి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి పిఎసిఎస్ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఎకరాకు 26 క్వింటాళ్ల మొక్క జొన్న మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నియమ నిబంధనలు జారీ చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎకరాకు 40 క్వింటాలకు పైగా మొక్కజొన్న పంట దిగుబడి అవుతుందని, కొనుగోలు కేంద్రంలో కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగతా పంట ప్రైవేట్ వ్యాపారస్తులకు క్వింటాలకు రూ. 1500 నుండి 1700 లోపే విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, దీంతో ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ విస్తరణ అధికారులు యాసంగి సీజన్లో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టకుండా రైతు వేదికలో పంట నమోదు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల మొక్కజొన్న పండించిన రైతుల పేర్లు కూడా ఆన్లైన్లో నమోదు కాకపో వడంతో పంట విక్రయించడానికి టోకెన్లు జారీ చేయలేని పరిస్థితి నెలకొం ది. వ్యవసాయ విస్తరణ అధికారులు టోకెన్లు జారీ చేసిన కూడా పిఎసిఎస్ సిబ్బంది ఆన్లైన్లో పంట నమోదు వివరాలు చూశాకే గన్ని సంచులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలతో పండించిన మొక్క జొన్న పంటను ఎలా విక్రయించాలని రైతులు ఆందోళనలో కొట్టుమిట్టా డుతున్నారు.
సెలవుల్లో వ్యవసాయ అధికారులు
మండలంలో గట్లకానిపర్తి, శాయంపేట, ప్రగతిసింగారం, పెద్దకోడ పాక గ్రామాలను క్లస్టర్ లుగా ఏర్పాటు చేసి ఆయా క్లస్టర్లకు ఒక్కొక్క ఏఈఓ ను నియమించారు. పెద్దకొడపాక క్లస్టర్ ఏఈఓ శివకుమార్ గత రెండు నెలల నుండి సెలవు పై వెళ్లడం, ఆ క్లస్టర్ లోనే అత్యధికంగా పంట సాగు అవడంతో టోకెన్ల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యవసాయ అధికారి కూడా గత 20 రోజుల నుండి సెలవు పై వెళ్లడంతో ఎవ్వరికి సమస్యను చెప్పుకోవాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పంట మొత్తం కొనుగోలు చేయాలి
రైతులు యాసంగి సీజన్లో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి. ఎకరాకు 26 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయాలనే నిబంధనను తొలగించాలి. రంగు మారిన మక్కలను కొనుగోలు చేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికలో కూర్చుని పంట నమోదు వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఆన్లైన్ సర్వే కాకుండా రైతు పండించిన మక్కలన్నిటిని కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి.
-దూదిపాల బుచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
ప్రారంభించని కొనుగోళ్లు
మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. దీంతో రైతులు మొక్కజొన్న పంటను విక్రయించడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోకి తీసుకువచ్చి పెద్ద మొత్తంలో నిల్వలు చేశారు. ఇప్పటివరకు నిర్వాహకులు తూకం మొ దలు పెట్టకపోవడంతో బస్తాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుం ది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో టార్పాలిన్ కవర్లు కప్పు కొని పంటను కాపాడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మక్కలు తడిసి రంగు మారడం, ఫంగస్ రావడంతో మార్క్‌ఫెడ్ అధికారులు పరిశీలిం చాకే కొనుగోలు చేయాలని నిర్వాహకులు వేచి చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.