Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవని గమనానికి ఆధారమైన సూర్యచంద్రులే నిద్రాహారాలు మాని పయనిస్తుంటే మనిషి మాత్రం మత్తులో జోగుతూ సోమరి అవుతున్నాడు..
మానవత్వం ప్రదర్శించాల్సిన హృదయాలలో ఎప్పుడు స్వార్థం అడుగంటునో ఎక్కడ క్రమశిక్షణ జనించునో సమయపాలనా మార్గాన సాగాల్సిన జీవితం ఎన్నడు సార్థకం చేసుకోబడుతుందో ఎప్పుడు సంపూర్ణ ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ నిండుగా ఉంటుందో ఎక్కడ మంచి ఆలోచన మనసు పొరల్లోనే ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ ప్రతి వ్యక్తి ధైర్యంగా తన లాగా తాను జీవిస్తాడో నా ఈ ప్రపంచంలో ఆకలి కేకల లేని పరిపాలన వస్తుందో
కార్పొరేట్ విద్య పేదల బ్రతుకులు వెలుగు ఎప్పుడు కోరుకుంటుందో ఆ లోకంలోకి సాగాలి మనిషి పయనం
ఆ దిశగా న్యాయం కోసం ఏనాడు అడుగులు నడుస్తాయో
గొంతులు కలిపి పిడికిలి బిగించిన పేదవాని ఉద్యమం సాగుతుందో గవర్నమెంటులో నాణ్యమైన విద్య కొరవడిదెందుకని ఎప్పుడైతే యువత ప్రశ్నించడం మొదలు పెడుతుందో అప్పుడు మాత్రమే
నా ప్రపంచం అభివద్ధి చెందుతుంది
- మిట్టపల్లి తిరుపతి,
కొండపల్లి