Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాటల తేనెలు పూసి
మెత్తగా కోసే ప్రయత్నం
ఉపమానాల వెన్నెలలు పరిచి
శ్రమ దోపిడి చేసే వైనం...
సూరీడికి హారతి పట్టి
కోడి కూయకముందే
ఇల్లూ వాకిలిని దిద్దే ఇల్లాలి
బతుకంతా మౌన సాగరం
గగన వనంలో వెలుగు కిరణమని
భువన తలం పై సహన దీపమని
మెల మెల్లగా కరిగించి కబళించే
కళామయ నాటకం
కలికి కనుల పుటలలో కదిలే
నిశ్శబ్దాక్షర నిర్వేదాన్ని చదువు
ముదిత హదయ గగనంలో
మౌనంగా ఎగసే వేదనా
విహగాలను చూడు....
శతాబ్దాల జీవన గమనంలో
తరువై ఒదిగి హిమమై కరిగి
ప్రేమామతం పంచే
తరుణి కథలో
విషాద వీణా తంత్రుల కన్నీటి
స్వరమేమిటి?
హిమ దీపంగా సుమ గీతంగా
పరిమళాలు పంచే
పడతి మనసులో
వేల వేల మౌన శంఖాలు
వేకువ కే కళలను అద్ది
రాతిరికే మెలకువలను నేర్పే
నెలత కంఠాన గరళ తిమిరాలు
- వెల్ముల జయపాల్ రెడ్డి, 9441168976