Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా! భారతమాతా!
నువ్వు దాస్య శంఖలాలు తెంచుకొని
రెక్కలు విప్పుకున్నాక
నేను కళ్ళు తెరిచాను.
ఈ సంగతి నీకు తెలుసు లోకానికి తెలుసు
నాకూ తెలుసు
కానీ ఇన్నాళ్ళకు,
నేనిప్పుడు డియన్ఏ టెస్ట్ చేయిచుకోవాలట !
అదిగో !
అప్పుడే కొన్ని చెవులు కొరుక్కుంటున్నాయి
మరి కొన్ని చేతులు బిగుస్తున్నాయి !
నిన్ను తాకట్టు పెట్టినా
అమ్మకానికి విశ్వ విఫణిలో నిలబెట్టినా
నేను నోటికి తాళం వేసుకొని ఉండాలట!
ప్రశ్నిస్తే,
అర్థరాత్రి తనిఖీలు అరెస్టు వారెంటులు
''అయ్యా యస్స్'' అంటే అవార్డులు రివార్డులు
ఐనా,
నీ స్వతంత్య్ర పోరాట స్ఫూర్తితో
భగత్ సింగ్ ఆజాద్ ల నినాదాలతో
మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాను
వందే మాతరం వందే మాతరం
- మండవ సుబ్బారావు
9493335150