Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదుగో చూడు!
అల్లంత దూరాన కొండలు
కావవి కొండలు
నింగి తల్లి
నేలమ్మకు ఎత్తిన బోనాలు!
కొండలను చూస్తే
అచ్చం భోనాల వరుసలే!
ఎవరో ఎత్తుకవచ్చి పెట్టిన
అక్షయ పాత్రలే!
సూర్య బింబం
బోనాలపై వెలుగుతున్న దీపం!
కొండల మధ్యన చూస్తే
పసుపు బొట్టై దీపించే చంద్రబింబం!
కొండలపై చెట్లు చేమలు
రాళ్లు రప్పలు బోనాలకు
అలరారే అలంకరణలు!
రాత్రి వేళల్లో నక్షత్రాలు
బోనాలకు మల్లె పందిరుల
వెలుగులైతయి!
పాలపుంత మెత్తని తివాచీ!
మేఘాలు బోనాలకు గొడుగులైతయి
ఉరుములు మెరుపులు
భవిష్య వాణి పలుకుతయి!
మనం ప్రయాణిస్తూ చూస్తే
కొండలు భోనాలై ఊరేగుతున్నట్లు
ముచ్చటేస్తుంది!
ఎప్పుడు చూసినా
తలపై భోనం నిండుగ!
భారము కాదు తల్లికి
తన పిల్లల కడుపులు నిండగ!
తన పిల్లల కడుపులు నిండితే
నేలమ్మకు రోజూ బోనాల పండుగే!
- పి.బక్కారెడ్డి,
9705315250