Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిమ్మలం అంటూనే
ఊహల ఉయ్యాలలో
కొత్త దారి వెతుక్కుంటూ
మెత్తగా జారుకుంది
కొన ఊపిరి.
ఉన్నపళంగా వెళ్లిపోయాక
నేటితో ముగిసింది
నిన్నటి రేపు
కన్నీటితో నిండింది
చివరి చూపు.
పరిచయాన్ని గుర్తుచేస్తూ
పలుకుల ఊటలు,
జ్ఞాపకాల పుటలు.
మౌనంగా పలికేవి
ఆఖరి మాటలు.
కోరుకున్నది
కడసారి కరచాలనం.
చూసింది
మట్టితో ఆలింగనం.
ఆప్యాయతకి అమరత్వాన్ని
అందించి వెళ్తారు.
అభిమనాన్ని అక్షరాలుగా
చిందించి ఉంటారు.
తుది అంకం ముగిశాక
ఒక్కటే నుడి.
ఎడతెరపి లేకుండా
చెక్కిట తడి.
ఎదలో మిగిలేది
చెలిమి చిత్తడి.
- కుడికాల వంశీధర్, 9885201600