Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రోషం ఉప్పెనౌతోంది..
గుండె మండిపోతోంది..
ఏదో చేసేయ్యాలన్న కసితో
నరం నరం సమాయత్తమవుతోంది..
ఏళ్ళ తరబడి అదే మోసం
అదే దోపిడి..
కరెన్సీ భాషే సర్వామోదం
కాగితాలతోటే అన్నీ కప్పెట్టెయ్యడం..
జానెడు పొట్ట నింపుకోడానికి
కాకుండా
జగమంత బొక్కసాన్ని నింపి
దాచేసుకోవాలన్నంత తాపత్రయమెందుకు?..
సౌభ్రాతత్వ భావనలు
పుస్తకాలకే పరిమితమా?..
దరికి చేరితే
దోచెయ్యడమేనా పరమావధి?
నీలో దైవత్వానికి ఉనికి కనబడుతుందనుకుంటే
రాక్షసత్వానికి సాధుముసుగు ద్యోతకమవుతోందేమిటి?
ఎన్నిసార్లు పెరికివేసినా
కలుపుమొక్కల్లా మళ్ళీ విస్తరిస్తూనే ఉన్నారు..
కబంద హస్తాలతో
కబలించేస్తున్నారు..అందుకే
మానవుడు..దానవుడుగా మారిన ప్రతిసారి..
దుష్ట శిక్షణ తప్పనిసరి..!!
- సుజాత.పి.వి.ఎల్ 7780153709