Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కోసం సృష్టించబడిన ప్రకతికి
మనమే శత్రువులుగా మారిపోయాం..
దైవాలైన పంచభూతాల్ని కూడా
కలుషితంతో నింపేశాం..
నిస్వార్ధంగా ప్రాణవాయువునిచ్చే
పచ్చని చెట్ల ప్రాణాలని
స్వార్థం కోసం ఏనాడో మింగేశాం..
ఊపిరి పోసే వాటి ఉసురు తీసేసి..
నేడు ప్రాణవాయువు కరువై..
ప్రాణాలొదిలేస్తున్నాం..
మనం సష్టించే శబ్దాలని తట్టుకోలేక
ప్రకతి నిశ్శబ్దంగా రోదిస్తూంటే..
ఏమీ ఎరగనట్టు తప్పించు తిరిగేశాం..
నల్లబడ్డ మన మనసుల వల్ల
నేల నలుపెక్కేసింది..ప్రకతి కన్నెర్ర జేసింది..
దాని చుట్టూ వాతావరణం మసి బారింది..
కత్రిమమైన జీవితానికి అలవాటు పడ్డ మనం.
కత్రిమ గాలి, కత్రిమ వర్షాల కోసం
అర్రులు చాచుతున్నాం..
అభివద్ధి ముసుగులో
అద్భుతంగా బతికేస్తున్నామనే
భ్రమలో బతుకీడుస్తున్నాం..
ఇప్పటికైనా
కళ్ళు తెరుద్దాం..
చెట్లు పెంచుదాం..
ముందు తరాల వారికి
ప్రాణభిక్ష పెడదాం..
ఉన్నంత కాలమైనా
పచ్చగా జీవిద్దాం..!!
- సుజాత.పి.వి.ఎల్, 7780253709