Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం గాడి తప్పి
గమ్యం తెలియక నిశ్చేష్టుడినై
దారితెలియక రహదారి కూడలిలో
తచ్చాడుతున్న దశలో
ఆదుకుని హత్తుకున్నది మీరే!
ఉద్వేగాలలో, ఉత్సాహాలలో
ఒంటరితనం సాలెగూడులో
చిక్కి గింజుకుంటున్న వేళల్లో
భరించలేని దుఃఖమో బాధనో
మెలివేసే అసందిగ్ధ క్షణాల్లో
మేమున్నామంటూ వెన్నంటి
నిలిచింది, నన్ను నడిపించింది
తోడుగా నీడగా పందిరైంది
మీ సహవాసమే కదా !
అయినవాళ్ళు అందరూ
ఎవరికి వారై దూరమైనా
బ్రతుకు భయం నడుమ
మత్యు నాదాల హౌరులోనూ
చేయి వదలక ఆశల ఊపిర్లూది
ఎదిరిచూసే ఆనంద రోజులకోసం
కలిసి సాగించే జీవనయానాన నన్నునిలబెట్టినఅమతమూర్తులు
జీవిత ద్వజ స్థంభాల్లాంటి
జీవనసహచరి ఒకవైపు,
ఇంకోవైపు అక్షర నేస్తాలే కదా!
- డా. కె. దివాకరాచారి, 9391018972