Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న ఓ బ్రహ్మ
జన్మకు కారణమవుతూ !
నాన్న ఓ స్నేహితుడు
చిన్ననాటి నుండి నీతో ఆడుకుంటూ!
నాన్న ఓ నిచ్చెన
ఎదుగుదలకు మెట్లు అవుతూ !
నాన్న ఓ గురువు
నిరంతరం జీవితపాఠాలు బోధిస్తూ !
నాన్న ఓ మార్గదర్శకుడు
బ్రతుకుకు బంగారు బాట చూపుతూ !
నాన్న ఓ రక్షక కవచం
నీ ఒంటిని కనురెప్పలా కాస్తూ !
నాన్న ఓ అనురాగ సింధువు
ఎన్నో స్వేదబిందులు చిందిస్తూ !
నాన్న ఓ త్యాగజీవి
నీకన్నింటినీ ఇవ్వడానికి
తనెన్నింటినో కోల్పోతూ!
నాన్న పాలలో వెన్న
కడవరకూ తన కష్టాలను
నీకు కనబడక దాచేస్తూ !
- సురేంద్ర రొడ్డ
సెల్: 9491523570