Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్లు రెప్పలార్చిన ప్రతిసారి..
వెలుగు చీకట్ల మిలమిలలు
వెక్కిరిస్తున్నాయి..
చేతులు చాచిన ప్రతిసారి..
చేరలేని తీరాన్ని
దూరం వెలివేస్తోంది..
పాదం కదిపిన ప్రతిసారి..
పచ్చిక లతిక స్పర్శ ఆర్తిగా విలపిస్తోంది..
చెక్కిలిపై జలజల జారుతున్న
కన్నీటి చారికలన్నీ ఇంద్రచాపంలా
అగుపిస్తుంటే..
విడిచే ప్రతి భావం ఒంటరితనాన్ని
పరిహసిస్తున్నట్టనిపిస్తోంది..
నా ప్రతికదలికలో
నీ ప్రతి స్పందన ప్రస్ఫుటంగా
కనిపిస్తుంటే..
నీకోసం తషిత తప్త హదయురాలినై..
ఒక ఉదయం
ఒక అస్తమయం నడుమ
కక్షావైక్షకురాలినై పరిభ్రమిస్తున్నా..!
- సుజాత.పి.వి.ఎల్., 7780153709