Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి
గాలాడ్తలేదు
అంతా చీకటి
నిన్నటిదాకా నా అనుకున్న బంధాలన్నీ
పాతాళంలో దాక్కున్నాయి
ప్రాణానికి యముడికి మధ్య కురుక్షేత్రం
నోట్ల కట్టలకు శ్వాసకు తులాభారం
శ్వాసది పైచూపు
నోట్ల కట్టలది నేల చూపు
మాయరోగం మంటలు గక్కుతుంది
మనుషులు భూమ్మీద నూకలు
లెక్కపెట్టుకుంటుండ్రు
పోయే పానం పోతుంది
నిలిచే ఊపిరి నిలదొక్కుకుంటుంది
కొందరు మాత్రం ఆయుష్షును
సప్త సముద్రాలవతల
దాసుకొచ్చుకున్నమని విర్రవీగుతూ
శవాల మీది చిల్లర పోగేసుకుంటుండ్రు
బతుకుపోరాటం ఒకరిది
కాసుల ఆరాటం ఇంకొకరిది
వెర్రి ప్రజలు ఖరీదైన వైద్యానికి
పరుగులు పెడుతూనే ఉన్నరు
ఇకనైనా చీకట్ల బాణాలనేసుడు ఆపి
ఊరి ఊరికో దవాఖాన
మీ పిల్లలే వైద్యనారాయణులు
గట్టి కలను కనండి
ప్రణాళికలు సిద్ధం చేయండి
ఇవ్వాళ కరోనా
రేపు మరొకటి
ఇప్పటికైనా మేల్కొందాం పదండి
- ఉప్పల పద్మ
9959126682 & 8340933244