Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవారాధన ముందు
మళ్ళీ దైవారాధన
వెనక్కి మళ్ళింది
చట్టం న్యాయం ధర్మం
ఇప్పుడున్నీ
తలదించుకున్నాయిగా
అసలు రాజ్యకేతనమే
నేడు సిగ్గుతో నైతిక
అవనతం అయింది
సంకల్పమే కాదు
సుస్థిర క్రియాశీలతకు
సరికేతమై
సమున్నతంగా
నిలిచావు మరి...
పడిపోకుండా
నిలబడటం
నిలబడి నిలకడగా
పని చేయడం
నీ వల్లే తెలిసింది
ఎక్కడ పుట్టావు?
ఎక్కడ పెరిగావు?
ఏమి చేశావు?
ఎలా బ్రతికావు?
సంకుచితాలు
సరిహద్దుల్లేని
సమాధానమే
నువ్వు కదా...
మనోబలానికి
వయసు అడ్డం కాదని
నవ్వుతూనే చెప్పావు
ఊగిసలాటలు వద్దు
ఉద్యమమే ముద్దు
ఇదేగా మాకిచ్చిన
జీవన సందేశం
చూస్తావుగా..
నీ బాటలో
నవ్వుతూ నడుస్తాం..
(స్టాన్స్వామికి శ్రద్ధాంజలి ఘటిస్తూ...)
- కె.శాంతారావు
సెల్: 99597 45723