Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయంకాలపు హౌరు గాలిలో మేఘాల ఘర్షణ
అతికష్టం మీద ఒడ్డుకు చేరిన పడమటి ఓడలు
పసివాడి నిశ్శబ్దపు కడుపులో ఆకలి గర్జన
కూటి కొరకు ప్రార్థనను అడ్డుకున్న ఎత్తైన మేడలు
తల్లిదండ్రుల అదశ్యం,
మంచి చెడుల వ్యత్యాసం
తెలుసుకోలేని బాల్యం,
సొంత కడుపుతో పోరాటం
అరటి, అటుకులు,
మెతుకులు దొరకలేదు కనీసం
కడుపు నింపాయి
చినుకులు, కన్నీళ్ళ మిశ్రమం
నిద్దురలో కలలు కనగలిగిన స్వేచ్ఛ నీది
పొట్ట నిండే కూడు
దొరకడం అదష్టం అంటే
ఖాళీ కడుపుతో కలలు కనలేని
దురదష్టం ఎందరిది?
రంగు కాగితాల కొరత కాదు పేదరికం అంటే..
- ఆదర్శ్ మైనేని,
సెల్: 8247008613