Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని క్రౌంచ్య పక్షులు ఊపిర్లు వదిలి
నింగి అంచుల్లో కలగలసిపోయాయి.
నీటిలో ఊపిరాడని గాలి బుడగలు
నదినిపెనవేసుకున్నాయి.
కంటిపాపలను వదలి
దూరంగా పయనమయ్యాయి.
ఒంటితీగపై నడక సాగి సాగి
నేలకు దిగిన ప్రాణాలు.
నడక ఇక్కడితో ఆగలేదు.
సడక్ అక్కడే మూసుకు పోలేదు.
చేదుపాటలన్నీ దూరంగా
వాయులీనమైపోయాయి...
ఛలో...ఛలోదిల్ దారు ఛలో...
చాంద్ కే పార్ చలో...
గాలి తెమ్మెరెపై తేలికైన గానం
గుండె ద్వారాన్ని తెరుస్తూ
తీసుకెళుతుంది నన్ను.
విషాదాశవులు లేని మార్గంలోకి.
ఆకుపచ్చని గుహల్లోకి,
ఆకాశాన్ని తాకే కొండకొనాకు అంచుల్లోకి...
గుండెల నిండా గాలిని హత్తుకుంటూ నేను.
చంద్రకాంతి తునకలు తునకలుగా పరుచుకుంటుంది.
నాకుు సెలయేటికి సౌదా కుదిరిచ్చి
తను తరలి పోయింది....
తుషారాలను వేలి కొసల పడుతూ...
లోయల్లో ప్రతిధ్వని అన్వేషిస్తూ నేను....
అలసిన రెక్కల,దారి తప్పిన ముసాఫరులను
వెంటేసుకుని వస్తోంది ... తను.
- సీహెచ్. ఉషారాణి, 9441228142