Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కడి బొక్కసం నిండడం,
అనేకుల డొక్కలు ఎండడం..
అభివద్దీ కాదు,
ఆర్ధిక స్వాతంత్య్రమూ కాదు.
ఒక్క రోజు ఓటేసే అధికారం,
తక్కినన్నాళ్ళూ చెల్లని అభిప్రాయం..
ప్రజాస్వామ్యమూ కాదు,
రాజకీయ స్వాతంత్య్రమూ కాదు.
మనిషిని మనిషిగా చూడలేని
ఎక్కువ తక్కువ లెక్కలు,
పెక్కురకు దక్కని ప్రాధమిక హక్కులు,
నాగరికమూ కాదు,
సామాజిక స్వాతంత్య్రమూ కాదు.
సోదరా,
అందిన స్వాతంత్య్రం..
ఇంకా అసంపూర్ణ రూపం
సకల జనుల క్షేమమే సంపూర్ణ స్వరాజ్యం
స్వచ్ఛ రాజకీయాలూ,
స్వావలంబన యత్నాలూ,
సహౌదర భావాలూ
ప్రోదిచేయుట ఆ మార్గం.
ప్రతీ భారతీయుని కర్తవ్యం.
- డా. డి.వి.జి.శంకర రావు, 94408 36931
మాజీ ఎంపీ, పార్వతీపురం.